Thursday, September 18, 2025

‘మిరాయ్’ @ 100 కోట్లు.. ఐదు రోజుల్లోనే..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తేజా సజ్జా హీరోగా, మంచు మనోజ్ ప్రతినాయకుడి పాత్రలో నటించిన చిత్రం ‘మిరాయ్’ (Mirai). గత శుక్రవారం(సెప్టెంబర్ 12) విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. అతీంద్రియ శక్తులు, మైథాలజీ కథాంశంగా ఈ సినిమాను కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించారు. అయితే ఈ సినిమా విడుదలైన ఐదు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరింది. ఈ సందర్భంగా తేజా సజ్జా, మంచు మనోజ్‌లు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. తాజాగా ఈ సినిమా సక్సెస్ మీట్‌ను విజయవాడలో ఘనంగా నిర్వహించారు. ప్రతీ ఒక్కరు కుటుంబంతో సహా ఈ సినిమా చూసేందుకు టికెట్ ధరలు కూడా పెంచలేదని నిర్మాత విశ్వప్రసాద్ తెలిపారు. ఈ విజయంతో తమపై మరింత బాధ్యత పెరిగిందని ఆయన అన్నారు.

ఇక దర్శకుడు కార్తీక్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమాకు (Mirai) సీక్వెల్ ఉంటుందని ఖరారు చేశారు. అందులో నిధి అగర్వాల్ స్పెషల్ సాంగ్‌లో కనిపిస్తుందని తెలిపారు. నిధితో ఓ ప్రత్యేక పాట చిత్రీకరించామని.. అయితే మొదటి పార్ట్‌లో దాన్ని వాడలేకపోయామని అన్నారు. సెకండ్ పార్ట్‌‌లో వాడేందుకు ఐడియాలు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.

Also Read : అమెరికా కాన్సులేట్‌కు వెళ్లిన తారక్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News