Thursday, September 18, 2025

పేదరిక నిర్మూలన జరగాలంటే విద్య ఒక్కటే మార్గం: రేవంత్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: విద్యావిధానంలో సమూల మార్పులు, ప్రక్షాలళనకు నిర్ణయం తీసుకున్నామని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. విద్యా విధానంలో మార్పులతో పాటు పేదరిక నిర్మూలన జరగాలని అన్నారు. తెలంగాణ నూతన విద్యా విధానంపై సిఎం సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా సిఎం మీడియాతో మాట్లాడుతూ.. పేదరిక నిర్మూలన జరగాలంటే విద్య ఒక్కటే మార్గం అని అంతర్జాతీయ స్థాయికి మన విద్యా విధానం సరితూగట్లేదని తెలియజేశారు. ఏటా లక్షా 10 వేల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు వస్తున్నారని, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లతో 15 శాతం మందికే ఉద్యోగాలు వస్తున్నాయని అన్నారు.

విద్యాశాఖ కు రూ. 21 వేల కోట్లు కేటాయిస్తే.. 98 శాతం జీతాలకే పోతోందని, విద్యా విధానంలో మార్పులు తీసుకురావడమే తన ధ్యేయం అని పేర్కొన్నారు. 73 లక్షల మంది యువతకు మంచి భవిష్యత్తు ఇవ్వాలన్నదే తన లక్ష్యం అని దేశ విద్యా విధానాన్ని మార్చేలా తెలంగాణ విద్యా విధానం ఉండాలని అధికారులకు సూచించారు. పాఠశాల విద్యలో లోపాలున్నాయని, విద్యా అంశంలో రాజకీయ ఇబ్బందులు ఎదుర్కోవడానికి సిద్ధం అని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.

Also Read : ప్రజలే రాసుకున్న పోరాట చరిత్ర మనది: రేవంత్ రెడ్డి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News