Wednesday, September 17, 2025

ఒటిటిలోకి రొమాంటిక్ కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

- Advertisement -
- Advertisement -

ఈ ఏడాది ‘భైరవం’ అనే మల్టీస్టారర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరో నారా రోహిత్.. ఆ తర్వాత సోలోగా ‘సుందరకాండ’ (Sundarakanda) అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. అయితే థియేటర్‌లోకి వచ్చిన నెల రోజుల్లోనే ఈ సినిమా ఒటిటిలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ నెల 23వ తేదీ నుంచి సుందరకాండ సినిమా ‘జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఒటిటి సంస్థ అధికారికంగా ప్రకటించింది. ‘ఏ రెండు ప్రేమకథలు ఒకేలా ఉండవు’ అని సినిమా నేపథ్యాన్ని తెలియజేస్తూ ఈ వివరాలను వెల్లడించింది.

ఇక ఈ సినిమా విషయానికొస్తే.. ఈ సినిమాలో (Sundarakanda) శ్రీదేవి విజయ్‌కుమార్, వృతి వాఘని హీరోయిన్లుగా నటించారు. వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాను సంతోష్ చిన్నపోల్లా, గౌతమ్ రెడ్డి, రాకేశ్ మహంకాళీ నిర్మించారు. లియోన్ జేమ్స్ ఈ సినిమాకు సంగీతం అందించారు. మరి థియేటర్‌లో ఆకట్టుకోలేకపోయిన సుందరకాండ.. ఒటిటిలో ఎలాంటి రెస్పాన్స్ సాధిస్తుందో చూడాలి.

Also Read : కీలక సన్నివేశాల కోసం భారీ సెట్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News