Thursday, September 18, 2025

జాన్వీ కపూర్ లేటెస్ట్ మూవీ.. ట్రైలర్ చూసేయండి..

- Advertisement -
- Advertisement -

శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. కొద్ది రోజుల క్రితం ‘పరమ్‌ సుందరి’ సినిమాతో మెప్పించిన ఈ ముద్దుగుమ్మ.. ‘సన్నీ సంస్కారి కీ తులసీ కుమారి’ అనే సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ కూడా విడుదలైంది. ఆ ట్రైలర్‌కి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా జాన్వీ నటిస్తున్న మరో చిత్రం హోం బౌండ్ (Homebound). ఈ సినిమాను నీరజ్‌ ఘైవాన్‌ దర్శకత్వంలో తెరకెక్కించారు.

తాజాగా ఈ మూవీ (Homebound) ట్రైలర్‌ని విడుదల చేశారు. ఇద్దరు చిన్ననాటి స్నేహితులు జీవితంలో పోలీస్ ఆఫీసర్ అవ్వాలని అనుకుంటారు. అందుకోసం ఎంతో కష్టపడతారు. అయితే వాళ్లు అనుకున్నది సాధించారా..? వీరిద్దరి జీవితాల్లో ఓ అమ్మాయి వచ్చాక ఏం జరిగింది..? అనే అంశాలతో.. యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఈ సినిమాను కరణ్ జోహార్, అదార్ పునావాలా, అపూర్వ మెహతా, సోమెన్ మిశ్రా సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా నెల 26న విడుదల చేయనున్నారు.

Also Read : మధురమైన మెలోడీ పాట

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News