Thursday, September 18, 2025

కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే సర్కార్ సంకల్పం: పిసిసి చీఫ్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్/ప్రత్యేక ప్రతినిధిః కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. బుధవారం ప్రకాశం హాలులో జరిగిన మహిళా సాధికారత సమావేశానికి మహేష్ కుమార్ గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళా సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తున్నదని చెప్పారు. ప్రభుత్వ పరంగా బిసి, ఎస్‌సి, ఎస్‌టి కార్పోరేషన్ల నుంచి కుట్టు మిషన్ల ఇప్పించేందుకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్కతో చర్చిస్తానని ఆయన భరోసా ఇచ్చారు. ప్రభుత్వ పథకాల పట్ల అవగాహన కల్పించేందుకు మదర్ ఫౌండేషన్ చేస్తున్న కృషిని ఆయన అభినందించారు.

ఇలాంటి సంస్థలను నడిపించడం అంత తేలికైన విషయమేమీ కాదని ఆయన తెలిపారు. హైదరాబాద్ విలీనం రోజున ఇటువంటి మంచి కార్యక్రమం చేపట్టినందుకు అభినందిస్తున్నానని అన్నారు. జనహిత పాదయాత్రలో ఇండిరమ్మ ఇండ్ల లబ్దిదారుల, మహిళల కళ్ళలో చూసిన ఆనందం గురించి తాను మాటల్లో చెప్పలేనని అన్నారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించామని ఆయన చెప్పారు. చదువుకున్న వారి జీవితం కలర్ టివీ వంటిదని, నిరక్షరాస్యుల జీవితం బ్లాక్ అండ్ వైట్ వంటిదని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News