Thursday, September 18, 2025

ఆరోగ్య శ్రీ సేవల నిలిపివేత పాక్షికమే

- Advertisement -
- Advertisement -

 రోగులకు యథావిధిగా ఆరోగ్యశ్రీ సేవలు
 సమ్మెకు దూరంగా ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులు
 ఆరోగ్యశ్రీ పేషెంట్లకు వైద్య సేవలు అందించిన 87 శాతం హాస్పిటల్స్
 కేవలం 13 శాతం ఆసుపత్రుల్లోనే ఆగిన సేవలు
 వైద్య సేవలు కొనసాగించాలని మరోసారి విజ్ఞప్తి చేసిన ఆరోగ్యశ్రీ సీఈవో ఉదయ్ కుమార్
 పేషెంట్లకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వ దవాఖాన్లలో ఏర్పాట్లు చేసిన అధికారులు
 ఆరోగ్యశ్రీ సేవలో ఎలాంటి అంతరాయం కలగదు: వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ

మన తెలంగాణ/హైదరాబాద్: ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలు యధావిధిగా కొనసాగాయి. పలు ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులు సమ్మెకు దూరంగా ఉన్నాయి. ఆరోగ్యశ్రీ రోగులకు 87 శాతం హాస్పిటల్స్ వైద్య సేవలు అందించాయి. కేవలం 13 శాతం ఆసుపత్రుల్లోనే సేవలు ఆగాయి. మొత్తం 477 ఆసుపత్రుల్లో 67 ఆసుపత్రులు మాత్రమే సమ్మెలో పాల్గొంటుండగా 415 ఆసుపత్రులు మాత్రం తమ వైద్య సేవలు అందిస్తున్నారు. కేవలం 5 శాతం మాత్రమే సమ్మె ప్రభావం కనిపించింది. కాగా పేషెంట్లకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వ దవాఖాన్లలో అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆరోగ్యశ్రీ కింద గత రెండు వారాలుగా సగటున రోజూ 844 సర్జరీలు నమోదుకాగా బుధవారం 799 సర్జరీలు నమోదు అయ్యాయని ఆరోగ్యశ్రీ సీఈవో ఉదయ్ కుమార్ వెల్లడించారు.

ఆరోగ్యశ్రీ సేవలో ఎలాంటి అంతరాయం కలగదు

రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవడంపై వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పందించారు. ఆరోగ్యశ్రీ సేవలను యథాతథంగా కొనసాగించాలని ప్రైవేటు ఆసుపత్రులను కోరుతున్నామన్నారు. ఈ విషయంలో తామిచ్చిన స్వేచ్ఛను గౌరవించాలని విజ్ఞప్తి చేశారు. గత తొమ్మిదిన్నర సంవత్సరాల్లో ఏనాడు ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేయని వారు ఇప్పుడు ఎందుకు వైద్య సేవలను ఆపుతున్నారో చెప్పాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రైవేటు ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ కింద నెలకు రూ.50 కోట్లు కూడా విడుదల కాలేదని గుర్తు చేశారు. తాము అధికారంలోకి వచ్చాక నెలకు రూ.100 కోట్లు ఇవ్వడానికి కమిట్‌మెంట్ ఇచ్చామన్నారు. ప్రజలకు ఆరోగ్యశ్రీ సేవలో ఎలాంటి అంతరాయం కలగదని, ప్రజలెవరూ కంగారు పడాల్సిన అవసరం లేదని దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు.

Also Read: నిరుద్యోగులకు శుభవార్త.. ఆర్‌టిసిలో 1,743 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News