అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో రోజు రోజుకు రాజకీయ దాడులు శృతిమించుతున్నాయి. కొన్ని పార్టీలు తమ కార్యకర్తలను రాజకీయాల కోసం వాడుకోవడంతో పాటు దాడులకు ఉసిగొల్పుతున్నారు. రాజకీయ భవిష్యత్ కోసం పచ్చని పల్లెల్లో రక్తపాతం సృష్టిస్తున్నారు. అమాయకపు ప్రజలు రాజకీయ దాడులకు బలవుతున్నారు. తాడిపత్రిలో టిడిపి నేత జెసి ప్రభాకర్ రెడ్డి వర్గీయులు రెచ్చిపోయారు. వైసిపి నేత, మాజీ కౌన్సిలర్ సూర్య ప్రభాకర్ బాబుపై వేటకోడవళ్లతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడి ప్రభాకర్ ను ఆస్పత్రికి తరలించారు. టిడిపి నేతల దాడిలో గాయపడ్డ సూర్య ప్రభాకర్ బాబును మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పరామర్శించారు. ఎపిలోని పల్నాడు జిల్లాలో దారుణం పిడుగురాళ్ల మండలం జూలకల్లులో టిడిపి నేతలు దాడులకు పాల్పడ్డారు. వైసిపి నాయకుడు చల్లా అంజిరెడ్డిపై కాపు కాసి వేట కోడవళ్లతో దాడి చేశారు. కాళ్లపై ఇనుప రాడ్లతో దారుణంగా కొట్టడంతో రెండు కాళ్లు విరిగిపోయాయి. గాయపడిన అంజిరెడ్డి పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స కోసం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
Also Read: విలీనమా.. విద్రోహమా.. విమోచనమా?