సూపర్ హీరో తేజ సజ్జా బ్రహ్మండ్ బ్లాక్‌బస్టర్ ‘మిరాయ్’. ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. రాకింగ్ స్టార్ మనోజ్ మంచు పవర్ ఫుల్ పాత్ర పోషించారు. రితికా నాయక్ హీరోయిన్ గా నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ భారీ స్థాయిలో నిర్మించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం బ్రహ్మండ్ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకుని అద్భుతమైన కలెక్షన్స్ తో హౌస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ విజయవాడలో బ్రహ్మాండ్ బ్లాక్ బస్టర్ సక్సెస్ సెలబ్రేషన్ నిర్వహించారు. మంత్రి కందుల దుర్గేశ్, ఎమ్మల్యే రఘురామకృష్ణంరాజు, డైరెక్టర్స్ బాబీ, సందీప్ రాజ్ హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకలో డైరెక్టర్ బాబీ మాట్లాడుతూ “తేజ పాన్ ఇండియా స్టార్‌గా అదరగొడుతున్నాడు. హనుమాన్ లాంటి సక్సెస్ తర్వాత ఒక సినిమాను నమ్ముకుని మూడేళ్లు పాటు అంకితభావంతో వర్క్ చేయడం మామూలు విషయం కాదు. మనోజ్ ఇంత గ్యాప్ వచ్చిన తర్వాత కూడా అదరగొట్టేశాడు.
కార్తీక్ ఈ సినిమాకి కెమెరామెన్‌గా, డైరెక్టర్‌గా, స్క్రీన్ రైటర్‌గా తీర్చిన దిద్దిన విధానం అద్భుతం. తను పడిన కష్టానికి ఫలితం దక్కింది. ఈ సక్సెస్‌కి ప్రధాన కారణం విశ్వప్రసాద్. ఈ సినిమాతో నిర్మాతగా విశ్వ ప్రసాద్ అమ్మాయి కృతి ప్రసాద్ పరిచయమై అద్భుతమైన విజయం అందుకున్నందుకు అభినందనలు”అని తెలిపారు. సూపర్ హీరో తేజ మాట్లాడుతూ “ఈ సినిమా సక్సెస్ కార్తీక్ ఘట్టమనేనిది, విశ్వప్రసాద్ది, మంచు మనోజ్‌ది, శ్రియాది, రితికాది, టీం అందరిదీ, మమ్మల్ని ఆశీర్వదిస్తున్న ఆడియన్స్‌ది, తెలుగు ఫిలిం ఇండస్ట్రీది. నా వంతు ప్రయత్నం నేను చేశాను. ఈ సినిమా ఫస్ట్ క్రెడిట్ కార్తీక్‌కి దక్కుతుంది. మాకు గొప్ప సపోర్ట్ ఇచ్చిన నిర్మాత విశ్వప్రసాద్‌కి ధన్యవాదాలు.
అందరూ ఫ్యామిలీతో కలిసి చూస్తారని ఈ సినిమాకి ఎలాంటి టికెట్ ధరలు పెంచలేదు”అని అన్నారు. రాకింగ్ స్టార్ మంచు మనోజ్ మాట్లాడుతూ “నేను ఈ వేదిక మీద ఉండాలని కారణం డైరెక్టర్ కార్తీక్. ఆయన చిన్నవారైనా సరే ఆయన టాలెంట్‌కి పాదాభివందనం. ఈ సినిమా చూసిన తర్వాత మా అమ్మగారు నన్ను పట్టుకుని చాలా ఎమోషనల్ అయిపోయారు. ఎన్నో సంవత్సరాల తర్వాత నా విషయంలో మా అమ్మ కళ్ళల్లో ఆనందం చూశాను. అలాగే మా అక్క కూడా చాలా ఆనంద పడింది. నా ఫ్యామిలీ అంతా కలిసి సినిమా చూస్తుంటే ఆ అనుభూతి జీవితంలో మర్చిపోలేను. నా విజయాన్ని మీ విజయంగా తీసుకుంటూ నన్ను ముందుకు నడిపిస్తున్న అభిమానులకు, స్నేహితులకు అందరికీ పాదాభివందనం.
నా తమ్ముడు తేజ సజ్జ ఇంకా గొప్ప స్థాయికి వెళ్ళాలని భగవంతుని కోరుకుంటున్నాను”అని తెలియజేశారు. నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ “ఈ సినిమాకి చాలా అద్భుతమైన విఎఫ్ఎక్స్ వర్క్ జరిగింది. ఈ సినిమాకి వాయిస్ ఇచ్చిన ప్రభాస్‌కి థాంక్యూ. సినిమాలో పనిచేసిన అందరికీ ధన్యవాదాలు”అని పేర్కొన్నారు. డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని మాట్లాడుతూ “కిషోర్ తిరుమల మా కోసం ఈ సినిమా చేశారు. మాకు రైటింగ్‌లో కూడా సహాయం చేశారు. విశ్వప్రసాద్ లేకపోతే ఈ సినిమా లేదు. మనోజ్ అన్న ఒక మ్యాజిక్. ఆయనకు నేను పెద్ద ఫ్యాన్. ఆయనతో వర్క్ చేయడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను. తేజ మూడేళ్ల తన జీవితాన్ని ఈ సినిమా కోసం పెట్టాడు. తనకి హృదయపూర్వక కృతజ్ఞతలు”అని అన్నారు. ఈ వేడుకలో శ్రియా, రితిక నాయక్, శశిధర్ రెడ్డి, పట్టాభిరామ్, గౌర హరి, మణి బాబు కరణం తదితరులు పాల్గొన్నారు.
Also Read : పొలిటికల్ సినిమాల్లో విభిన్నమైన చిత్రం