ఆస్ట్రేలియాతో అనాధికార టెస్టు
లక్నో: ఆస్ట్రేలియా ఎ తో (IndA vs AusA) జరుగుతున్న తొలి అనాధికార టెస్టు మ్యాచ్‌లో ఇండి యా ఎ టీమ్ మొదటి ఇన్నింగ్స్‌లో 30 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 116 పరుగులు చేసింది. ప్రత్యర్థి జట్టు తొలి ఇన్నింగ్స్ స్కోరు ను అందుకోవాలంటే ఇండియా టీమ్ మరో 416 పరుగులు చేయాలి. బుధవారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఓపెనర్ ఎన్.జగదీశన్ (55), సాయి సుదర్శన్ (20) పరుగులతో క్రీజులో ఉన్నారు. మరో ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ 58 బంతుల్లో ఆరు ఫోర్లతో 44 పరుగులు చేసి ఔటయ్యాడు.
Also Read: తాడిపత్రిలో రెచ్చిపోయిన జెసి వర్గీయులు… వేటకోడవళ్లతో వైసిపి నేత కాళ్లు నరికివేత
అంతకుముదు ఆస్ట్రేలియా టీమ్ (IndA vs AusA) 98 ఓవర్లలో ఆరు వికెట్లకు 532 పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్ చేసింది. వికెట్ కీపర్ జోష్ ఫిలిప్ అద్భుత సెంచరీతో ఆస్ట్రేలియాను ఆదుకున్నాడు. చెలరేగి ఆడిన ఫిలిప్ 87 బంతుల్లోనే 18 ఫోర్లు, 4 సిక్సర్లతో 123 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఫిలిప్ సాధించిన పరుగుల్లో 96 బౌండరీలు, సిక్సర్ల రూపంలోనే లభించడం విశేషం. దీన్ని బట్టి అతని బ్యాటింగ్ ఏ స్థాయిలో సాగిందో ఊహించు కోవచ్చు. లియమ్ స్కాట్ 122 బంతుల్లో 8 ఫోర్లు, రెండు సిక్సర్లతో 81 పరుగులు చేశాడు. జేవియర్ బార్ల్లెట్ 39 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఓపెనర్లు శామ్ కొన్‌స్టాస్ (109), క్యాంప్‌బెల్ (88) పరుగులు చేయగా, కూపర్ (70) తనవంతు సహకారం అందించాడు.