Thursday, September 18, 2025

ఇంటిల్లిపాది కలిసి చూసే మంచి సినిమా

- Advertisement -
- Advertisement -

వర్సటైల్ యాక్టర్ తిరువీర్, టీనా శ్రావ్య హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’. 7 పి.ఎం.ప్రొడక్షన్స్, పప్పెట్ షో ప్రొడక్షన్స్ బ్యానర్‌లపై సందీప్ అగరం, అస్మితా రెడ్డి బాసిని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. నవంబర్ 7న సినిమా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో టీజర్‌ను రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో శేఖర్ కమ్ముల మాట్లాడుతూ “తిరువీర్ మంచి హీరో. టాలీవుడ్‌లో తనకంటూ సొంతంగా ఓ స్థానాన్ని ఏర్పరచుకుంటున్నాడు.

తీరువీర్ ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ లాంటి మరిన్ని మంచి సినిమాలు చేయాలి” అని తెలిపారు. హీరో తిరువీర్ మాట్లాడుతూ “ఈ సినిమా నా నమ్మకాన్ని నిలబెడితే భవిష్యత్తులో ఇలాంటి కొన్ని సినిమాలు చేస్తాను. ఇంటిల్లిపాది కలిసి చూసే మంచి సినిమాగా ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ నిలుస్తుంది”అని చెప్పారు. డైరెక్టర్ రాహుల్ శ్రీనివాస్ మాట్లాడుతూ “మసూద హిట్టయిన తర్వాత తీరువీర్‌కు చాలా మంది కథలు చెప్పారు. కానీ వారందరిని కాదని డెబ్యూ డైరెక్టర్ అయినా నన్ను నమ్మాడు. అది జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను”అని అన్నా రు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ టీనా శ్రావ్య, నిర్మాతలు సందీప్, అశ్విత రెడ్డి, నటులు రోహన్, నరేంద్ర రవి, ఎడిటర్ నరేష్, మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి తదితరులు పాల్గొన్నారు.

Also Read:‘మిరాయ్’ సక్సెస్ మా టీమ్‌లో ప్రతి ఒక్కరిదీ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News