- Advertisement -
హైదరాబాద్: వనపర్తి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పెద్దల పండగ సందర్భంగా పొట్టేళ్లను తీసుకొని వెళ్తుండగా నాసనాల్లి సమీపంలో ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఆటో పైనుండి లారీ దూసుకెళ్లడం ఇద్దరు మృతి చెందారు. ఒకరు గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. పెద్దల పండుగ సందర్భంగా రవి(35), సరోజ(30) అనే దంపతులు ఆటోలో పొట్టేళ్లను తీసుకొని వస్తుండగా వాహనం బోల్తాపడింది. ఎదురుగా వస్తున్న లారీ, ఆటోను ఎక్కించడంతో రవి, డ్రైవర్ రాజు (38) అక్కడికక్కడే చనిపోయారు. సరోజ తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -