ఢిల్లీ: మైనార్టీలు, దళితులు, ఆదివాసీల ఓట్లు తొలగిస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపణలు చేశారు. ఎన్నికల సంఘం ఉద్దేశపూర్వకంగానే లక్షలాది ఓట్లు తొలగిస్తున్నారని దుయ్యబట్టారు. గురువారం ఓటు చోరీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ మీడియాతో మాట్లాడారు. కర్నాటకలోనూ ఓట్లను తొలగించారని, కర్నాటక ఎన్నికల్లో 6800 ఓట్లు తొలగించారని, లింక్‌డ్ మొబైల్ నెంబర్లన్నీ తప్పుడు నెంబర్లేనని తెలియజేశారు. కర్ణాటకలో ఓట్లు తొలగించేందుకు ఇతర రాష్ట్రాల ఫోన్ నెంటర్లు ఉపయోగించారని, ఓట్ల తొలగింపుపై తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేవారిని ఎన్నికల సంఘం కాపాడుతోందని రాహుల్ ధ్వజమెత్తారు.
Also Read: తాడిపత్రిలో రెచ్చిపోయిన జెసి వర్గీయులు… వేటకోడవళ్లతో వైసిపి నేత కాళ్లు నరికివేత
ఇప్పటికే వ్యవస్థను హైజాక్ చేశారని, సిఇసి జ్ఞానేష్ కుమార్‌పై రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫేక్ అప్లికేషన్లు ఫైల్ చేసి, ఫేక్ లాగిన్ ఐడిలతో ఓటర్ల పేర్లను డిలీట్ చేశారన్నారు. కాంగ్రెస్‌కు బలమైన ప్రాంతాల్లోనే ఓటర్ల పేర్లు తొలగించారని, సెంట్రలైజ్డ్ సిస్టమ్ ఏర్పాటు చేసి, ప్లాన్ ప్రకారం ఓట్లు తొలగిస్తున్నారని, మహారాష్ట్రలోని రాజురా అసెంబ్లీ నియోజకవర్గంలో 6,851 ఫేక్ ఓట్లు కలిపారని, కేవలం కాంగ్రెస్ ఓటర్లే లక్ష్యంగా ఓట్లు తొలగించారని, కాసేపట్లో హైడ్రోజన్ బాంబ్ పేల్చుతానని రాహుల్ చెప్పారు. ఇసిపై రాహుల్ డైరెక్ట్ ఎటాక్ చేశారు. తన ఆరోపణలు నిజం కాదని నిరూపించాలంటూ ఇసికి రాహుల్ సవాల్ విసిరారు. తాను చేసే ఆరోపణలపై 100 శాతం ఆధారాలున్నాయన్నారు.