Thursday, September 18, 2025

పాక్ ఫీల్డర్ నిర్లక్ష్యం. అంపైర్ తలకి తీవ్ర గాయం..

- Advertisement -
- Advertisement -

దుబాయ్: ఆసియా (Asia Cup) కప్ టోర్నమెంట్‌లో పాకిస్థాన్ క్రికెట్ టీమ్ చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో హ్యాండ్‌షేక్ వివాదం.. ఆ తర్వాత మ్యాచ్ రెఫరీని తొలగించాలని డిమాండ్ చేయడం.. నిన్న యుఎఇతో జరిగే మ్యాచ్‌ని తొలుత బాయ్‌కాట్ చేయడం.. ఆ తర్వాత గంట ఆలస్యంగా ప్రారంభమైంది. అయితే ఈ మ్యాచ్‌లో జరిగిన ఓ ఘటన ఇప్పుడు పాకిస్థాన్ క్రికెట్ టీమ్ ప్రవర్తనపై తీవ్ర విమర్శలకు దారి తీస్తుంది. ఈ మ్యాచ్‌లో పాక్ ఫీల్డర్ చేసిన పని వల్ల అంపైర్ రుచిత పల్లియాగురుగే నొప్పితో మైదానం వీడాల్సి వచ్చింది.

ఈ మ్యాచ‌లో (Asia Cup) తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 146 పరుగుల చేసింది. 147 పరుగుల టార్గెట్‌ని చేరుకోవడంతో యుఎఇ విఫలమైంది. అయితే ఆరో ఓవర్‌లో ధృవ్ పరాశర్ బ్యాటింగ్ చేస్తుండగా.. సయూమ్ ఆయుబ్ బౌలింగ్ చేస్తున్నాడు. ఈ ఓవర్‌లో ఐదో బంతిని థర్డ్‌మ్యాన్ దిశగా ఆడిన పరాశర్ సింగిల్ తీశాడు. ఇంతలో ఫీల్డర్ బంతిని అందుకొని నాన్‌-స్ట్రైకర్ ఎండ్‌కి విసిరాడు. దీంతో అక్కడ ఉన్న అంపైర్ రుచిత తలకు బలంగా తగిలింది. దీంతో ఆయన నొప్పితో విలవిలలాడిపోయి.. మైదానం వీడారు. అయితే ఈ పని ఉద్దేశపూర్వకంగా చేయకపోయానా.. పాక్ ఫీల్డర్ నిర్లక్ష్యం కొట్టేచ్చినట్లు కనిపిస్తోంది. దీంతో పాక్‌పై సోషల్‌మీడియాలో విమర్శలు వస్తున్నాయి.

Also Read : ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్.. ఫైనల్‌కు దూసుకెళ్లిన నీరజ్ చోప్రా

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News