Monday, May 12, 2025

ఆపరేషన్ సింధూర్‌తో ప్రపంచానికి సందేశం ఇచ్చాం: యోగి

- Advertisement -
- Advertisement -

లక్నో: ఆపరేషన్ సింధూర్(Operation Sindoor) వేళ అందరూ బ్రహ్మోస్ శక్తిని చూసుంటారు అని యుపి సిఎం యోగి ఆదిత్యనాథ్(Yogi Adityanath) అన్నారు. ఆదివారం లక్నోలో బ్రహ్మోస్ క్షిపిణి తయారీ కేంద్రం ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నిరు. ఈ కేంద్రాన్ని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభించారు. అనంతరం యోగి మాట్లాడుతూ.. బ్రహ్మోస్ శక్తి గురించి తెలియాలి అంటే.. పాక్ ప్రజలను ఆడగాలని చమత్కరించారు.

ఏ ఉగ్రదాడినైనా.. యుద్ధ చర్యగా పరిగణిస్తామని ప్రధాని ప్రకటించిన విషయాన్ని యోగి(Yogi Adityanath) గుర్తు చేశారు. ఉగ్రవాదాన్ని పూర్తిగా అణచివేసే వరకూ సమస్య పరిష్కారం కాదని అన్నారు. ఉగ్రవాదాన్ని అణచివేయాలంటూ.. మోదీ నాయకత్వంలో అందరూ ఏకగ్రీవంగా పని చేయాలని పిలుపునిచ్చారు. ఆపరేషన్ సింధూర్(Operation Sindoor) ద్వారా ప్రపంచానికి భారత్ సందేశం ఇచ్చిందని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News