- Advertisement -
హైదరాబాద్: టిఆర్‌ఎస్‌ను బిఆర్‌ఎస్‌గా మార్చుకొని తెలంగాణ ప్రజలతో పేగు బంధం తెంచుకుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శలు గుప్పించారు. పంచాయతీ రాజ్ చట్ట సవరణ బిల్లుకు అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ ప్రసంగించారు. బిసి రిజర్వేషన్లపై చర్చ జరుగుతుంటే మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ఎందుకు రావడంలేదని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతగా ఉన్న కెసిఆర్ సభకు రాకుండా ఫాంహౌస్‌లో పడుకున్నారని ఎద్దేవా చేశారు. కులగణణలో తెలంగాణ రోల్ మోడల్‌గా నిలిచిందని ప్రశంసించారు. ఇతర రాష్ట్రాల్లో వందల కోట్లు ఖర్చు పెట్టిన బిఆర్‌ఎస్ ఒక్క సర్పంచ్ గెలవలేదని, తెలంగాణ ఖజానాను లూటీ చేసిన బిఆర్‌ఎస్‌కు మాట్లాడే నైతిక హక్కులేదని ఆది మండిపడ్డారు.
- Advertisement -