- Advertisement -
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా ‘ఆకాశంలో ఒక తార’. సోమవారం దుల్కర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ గ్లింప్స్ ను మేకర్ విడుదల చేశారు. ఇందులో సాదారణ మధ్యతరగతి వ్యక్తిగా దుల్కర్ స్రీన్ ప్రజెంట్ ఆకట్టుకుంటోంది. గ్లింప్స్ చూస్తుంటే దుల్కర్ మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం ఖాయమనిస్తోంది. ఈ మూవీకి పవన్ సాదినేని దర్శకత్వం వహిస్తున్నాడు. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమాస్ సమర్పణలో లైట్ బాక్స్ నిర్మాణ సంస్థతో కలిసి సందీప్ గున్నమ్, రమ్యా గున్నమ్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు జీవి ప్రకాశ్ సంగీతం అందిస్తున్నాడు.
- Advertisement -