న్యూఢిల్లీ: యుఎఇ వేదికగా జరుగనున్న ఆసియా కప్ టి20 టోర్నమెంట్‌లో భారత్, శ్రీలంక జట్లకే ట్రోఫీ సాధించే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయని ప్రముఖ క్రికెట్ విశ్లేషకుడు ఆకాశ్ చోప్రా జోస్యం చెప్పాడు. టీమిండియా ఈ టోర్నీలో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతుందన్నాడు. అయితే లంకను కూడా తక్కువ అంచన వేయలేమన్నాడు. బ్యాటింగ్, బౌలింగ్‌లో సమతూకంగా ఉన్న టీమిండియాకు ట్రోఫీ సాధించే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయన్నాడు.
సూర్యకుమార్ యాదవ్, శుభ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్య, సంజు శాంసన్, ధ్రువ్ జురెల్, అక్షర్ పటేల్ వంటి స్టార్ ఆటగాళ్లు జట్టుకు అందుబాటులో ఉన్నారన్నాడు. ఈ టోర్నీలో వరుణ్ చక్రవర్తి టీమిండియాకు చాలా కీలకమన్నాడు. అతను బంతితో చెలరేగడం ఖాయమన్నాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ జట్టును ముందుండి నడిపించడం తథ్యమన్నాడు. పాకిస్థాన్ బరిలో ఉన్నా ట్రోఫీ సాధించడం ఆ జట్టుకు చాలా కష్టంతో కూడుకున్న అంశమన్నాడు.