Sunday, August 24, 2025

కీలక బిల్లుల జెపిసికి ఆప్ దూరం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రధాని, సిఎంలు, మంత్రులపై వేటు సంబంధిత బిల్లుల జెపిసికి ప్రతిపక్షాలు షాక్ ఇచ్చాయి. తమ పార్టీ కూడా జెపిసిలో చేరడంలేదని, తమ ఎంపిలను కమిటీకి పంపించడం లేదని ఆమ్ ఆద్మీపార్టీ ఆదివారం తెలిపింది. బిల్లుల పరిశీలనకు జెపిసి ఏర్పాటు అయింది. అయితే ఇదంతా కంటితుడుపు చర్య, మోడీ ప్రహసనం అని పేర్కొంటూ ఇప్పటికే టిఎంసి, సమాజ్‌వాది పార్టీలు నిర్ణయం తీసుకున్నాయి. ఏదో విధంగా ప్రతిపక్ష ప్రభుత్వాలను కూల్చివేయడమే కేంద్రంలోని బిజెపి తంతు అయింందని ఆప్ తరఫున ఎంపి సంజయ్ సింగ్ విమర్శించారు. మోడీ ప్రభుత్వం అధికార బలంతో చట్టాలకు సిద్ధం అయింది. ప్రతిపక్ష నేతలను జైలుకు పంపించడం, ప్రభుత్వాలను పడగొట్టడం, ప్రజాస్వామ్యానికి ముగింపు పలకడం బిజెపికి తంతు అయిందని సింగ్ స్పందించారు. బిజెపికి, అవినీతికి ఉన్న బంధం లైలా-మజ్నూ, రోమియో-జూలియట్ లాగా సాగుతూ వస్తోందని విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News