Thursday, June 19, 2025

భారీ ఆఫర్‌ని తిరస్కరించిన అమిర్‌ ఖాన్.. కారణం ఏంటంటే

- Advertisement -
- Advertisement -

ముంబై: బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ (Aamir Khan) నటిస్తున్న తాజా చిత్రం ‘సితారే జమీన్ పర్’. ‘లాల్‌ సింగ్ చద్ధా’ తర్వాత అమిర్ ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమా ఇది కావడంతో దీనిపై తారాస్థాయిలో అంచనాలు ఉన్నాయి. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ రూపొందిన ఈ సినిమాకు ఆర్‌ఎస్ ప్రసన్న దర్శకత్వం వహించారు. అమిర్ ఖాన్ స్వయంగా ఈ సినిమాను నిర్మించారు. గతంలో విడుదలైన ‘తారే జమీన్ పర్’ సినిమాకు ఇది సీక్వెల్. అయితే ఈ సినిమా విషయంలో అమిర్ ఖాన్ ఓ భారీ ఆఫర్‌ని తిరస్కరించారని టాక్ వినిపిస్తోంది.

ప్రస్తుతం ఎక్కడ చూసిన ఒటిటిల ట్రెండ్ నడుస్తోంది. విడుదలైన ఏ సినిమా అయినా.. కొన్ని వారాల్లోనే ఒటిటిలో అందుబాటులోకి వస్తోంది. దీంతో ‘సితారే జమీన్ పర్’ సినిమాకు కూడా ప్రముఖ ఒటిటి సంస్థ అమెజాన్ ప్రైమ్ ఓ భారీ ఆఫర్ ఇచ్చిందట. ఈ సినిమాను కొనుగోలు చేసేందుకు రూ.120 కోట్ల ఆఫర్‌ను అమిర్ (Aamir Khan) ముందుంచింది ప్రైమ్. అయితే ఆ ఆఫర్‌ని అమిర్ తిరస్కరించినట్లు తెలుస్తోంది. ప్రేక్షకులకు థియేటర్లలో చూసే అనుభూతిని కలిగించాలనే ఉద్ధేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని టాక్. ఇక ఈ సినిమాలో అమిర్ ఖాన్ బాస్కెట్ బాల్ కోచ్‌ పాత్రలో కనిపిస్తున్నారు. జెనీలియా కీలక పాత్రలో నటిస్తున్నారు. జూన్ 20వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News