పాటియాలా: అత్యాచారం కేసులో అరెస్టయిన ఆప్ ఎంఎల్‌ఎ హర్మీత్ సింగ్ పఠాన్‌మజ్రా మంగళవారం తన అనుచరుల కాల్పులు, రాళ్ల దాడి మధ్య అదుపు నుంచి తప్పించుకున్నారని పోలీసులు తెలిపారు. పఠాన్‌మజ్రా హర్యానాలోని కర్నాల్ జిల్లాలోని దబ్రీ గ్రామంలో ఉండగా అతడిని అరెస్టు చేయడానికి పోలీసు బృందం వెళ్లినప్పుడు ఈ ఘటన చోటుచేసుకుంది. నమోదయిన ఎఫ్‌ఐఆర్ ప్రకారం పఠాన్‌మజ్రాపై అత్యాచారం, మోసం, క్రిమినల్ బెదిరింపు అభియోగాలు ఉన్నాయి. ఎంఎల్‌ఎ తాను విడాకులు తీసుకున్నట్లు తప్పుగా ప్రకటించుకుని తనతో సంబంధం పెట్టుకున్నారని, వివాహం అయి ఉండగా 2021లో వివాహం చేసుకున్నారని జిరాక్‌పూర్‌కు చెందిన ఓ మహిళ ఫిర్యాదు చేయగా కేసు నమోదయింది. ఎంఎల్‌ఎ లైంగిక ఎక్స్‌ప్లాయిటేషన్, బెదిరింపులకు పాల్పడ్డమేకాక, అసభ్యకరమైన వీడియోలు పంపారని ఆమె ఆరోపించారు.
‘హర్యానాలోని పఠాన్‌మజ్రా నివాసంపై మేము రైడ్ చేశాము. అతన్ని అరెస్టు చేశాము. కానీ గ్రామస్థుల బృందం, కొంతమంది దుండగులు పోలీసు బృందంపై రాళ్లు రువ్వి, కాల్పులు జరిపారు. ఈ నేపథ్యంలో సనౌర్ ఎంఎల్‌ఎ తప్పించుకున్నారు. అతడి సహచరుడు, ఎంఎల్‌ఎ బల్వీందర్ సింగ్‌ను అరెస్టు చేసి, అతడి వద్ద ఉ్న మూడు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాం. టయోట ఫార్చూనర్ వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నాం’ అని పాటియాలా నేర పరిశోధన సంస్థ(సిఐఎ)ఇన్‌ఛార్జ్ తెలిపారు.