Friday, July 25, 2025

అందని ఆవాస్

- Advertisement -
- Advertisement -

డబ్బులు చెల్లించి తొమ్మిదేళ్లు
అయినా ప్లాట్లు అప్పగించని
నెబ్యులా పసిఫికా కన్‌స్ట్రక్షన్ కంపెనీ
బాచుపల్లిలో కొనుగోలుదారులు
ఆందోళన రెరా జోక్యం
చేసుకోవాలని కోరుతున్న బాధితులు
మన తెలంగాణ/నిజాంపేట్: నగరంలో ఒక సొం తిల్లు కొనాలని కలలుగన్న కుటుంబాలకు బాచుపల్లిలోని ఆవాస్ హైదరాబాద్ ప్రాజెక్టు అందని ద్రాక్షగానే మిగిలిపోతున్నది. ఫ్లాట్ బుక్ చేసుకొని డ బ్బులు చెల్లించి 9 ఏళ్ళు గడుస్తున్నా సొంత ఇంటి కల సాకారం కావడంలేదని బాధితులు ఆవేదన వ్య క్తం చేస్తున్నారు. ప్రజలను మభ్యపెట్టి డబ్బులు తీ సుకొని కాలయాపన చేస్తున్న సదరు నిర్మాణ సం స్థపై రేరా జోక్యం చేసుకొని న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బాచుపల్లి లో గుజరాత్‌కు చెందిన పసిఫికా కన్స్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 2016లో బాచుపల్లిలో ప్రారంభించిన ఈ గృహ ప్రాజెక్టు తొమ్మిదేళ్లు గడిచినా ఇంకా పూర్తి కాకపోవడంతో వందలాది మంది కొనుగోలుదారులు తీ వ్ర నిరాశలో కూరుకుపోయారు. 1 బిహెచ్‌కె, 2 బి హెచ్‌కె ఫ్లాట్లు – అందుబాటులో, పక్కా వాస్తు, సరసమైన ధరలు అంటూ 2016లో ఘనంగా ప్రారంభించిన ఈ ప్రాజెక్టు తొలిదశలో ఎంతో ఊపుమీద సాగింది.

9.8 ఎకరాల భూమిలో, సర్వే నంబర్లు 311(P), 312(P), 313(P), 316 (P), 317 (P) పరిధిలో హెచ్‌ఎండిఎ అనుమతులతో నిర్మాణం ప్రారంభమైంది. రెరా నంబర్: P02200000223, ప్రాథమికంగా డిసెంబర్ 22, 2020 నాటికి పూర్తి చేస్తామని హామీ ఇచ్చింది. అయితే 2019 నాటికి పనులు నెమ్మదించాయి. కరోనా కారణంగా నిర్మాణం ఆలస్యం అవుతున్నట్లు చెప్పిన సంస్థ అప్పటి నుంచి కాలం తిప్పుతూ వాయిదాల పేరుతో మొసలి కన్నీరు కారుస్తోంది. చివరకు 2023లో రేరా వద్ద గడువు పొడిగింపుకోరి జూన్ 30, 2025 వరకు సమయం తెచ్చుకుంది. ప్రస్తుతం జూలై నెల వచ్చేసినప్పటికీ నిర్మాణ స్థలంలో అభివృద్ధి స్పష్టంగా కనిపించకపోవడం కొనుగోలుదారుల్లో అసహనాన్ని రేకెత్తిస్తోంది.

బాధితుల ఆందోళన…
ఇటీవల ప్రాజెక్టు ప్రాంగణంలో పలువురు కొనుగోలుదారులు నిరసనకు దిగారు. జీవితకాల పొదుపులు పెట్టేశాం.. కానీ ఇప్పటికీ నెరవేరని ఇంటి కలలు మాకు అప్పుల ఊబిలో నెట్టేస్తున్నాయి అంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇఎంఐలు చెల్లిస్తూనే, అద్దె ఇళ్లలో బతుకు పోరాటం సాగిస్తున్నవారి పరిస్థితి దారుణంగా ఉంది. కొందరు వృద్ధులు, ఉద్యోగవేతనదారులు, చిన్న వ్యాపారులు, ఎన్‌ఆర్‌ఐలు ఈ ప్రాజెక్టులో తమ జీవితంలో సంపాదించిన డబ్బును పెట్టారు.
రేరా స్పందన ఉంటుందా?
రేరా అధికారులు ప్రాథమికంగా స్పందించినప్పటికీ, నిర్మాణ పురోగతి, పర్మిషన్ వివరాలపై స్పష్టత ఇవ్వలేదంటూ బాధితులు చెబుతున్నారు. ఇప్పటికే 30 జూన్ 2025 వరకు గడువు ఇచ్చిన అధికార సంస్థ, ఇప్పటి వరకు పనుల పురోగతిపై ఏ మేరకు సమీక్ష జరిపిందో తెలియకపోవడం బాధితులను మరింత ఆందోళనకు గురి చేస్తోంది.

హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌కు ఇది మచ్చేనా ?
ఒక్క నెబ్యులా ప్రాజెక్టు మాత్రమే కాదు, ఇటీవలి కాలంలో నగరంలో విఫలమైన గృహ ప్రాజెక్టులు పెరుగుతున్నాయి. ప్రభుత్వ, రెరా అధికారుల వైఖరిలో పారదర్శకత లేకపోతే ఇలాంటి మోసాలకు చెక్ పెట్టలేమన్నది నిజం. మధ్యతరగతి ప్రజల కలలతో ఆడుకునే సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ప్రజల సొమ్మును తీసుకొని ఇల్లు ఇస్తామంటూ మభ్యపెట్టి ప్రజలను చెప్పులు అరిగేలా సంస్థ చుట్టూ తిప్పుకుంటున్న వారిపై ప్రభుత్వం జోక్యం చేసుకొని చర్యలు చేపట్టాలని బాధ్యత ప్రజలు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News