టీం ఇండియా మాజీ క్రికెటర్ అభిషేక్ నాయర్‌కు (Abhishek Nayar) కీలక పదవి లభించింది. ఇప్పటివరకూ అసిస్టెంట్ కోచ్‌గా బాధ్యతలు నిర్వహించిన ఆయన.. హెడ్ కోచ్‌గా ప్రమోషన్ పొందారు. వుమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL)లో యూపి వారియర్స్ జట్టుకు ఆయన ప్రధాన కోచ్‌గా నియమితులయ్యారు. ఈ విషయాన్ని యూపి వారియర్స్ జట్టు సిఒఒ క్షేమల్ వేంగన్‌కర్ ధృవీకరించారు.
‘‘అభిషేక్ (Abhishek Nayar) మా జట్టుకు కోచ్‌గా రావడం చాలా సంతోషంగా ఉంది. ఆయన కోచ్‌గా వచ్చేందుకు సిద్ధమైన వెంటనే మరో ఆలోచన లేకుండానే ఒప్పందం చేసుకున్నాం. ఆటగాళ్లను తీర్చిదిద్ది, వారిలో విజయకాంక్షను రగిల్చే కొంత మంది కోచ్‌లలో అభిషేక్ ఒకరు. అతని అనుభవం మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. గత 18 నెలలకాలంలో అతను మూడు జట్లు ఛాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు యూపి వారియర్స్‌తో చేరడం మాకు ఎంతో ప్రత్యేకం’’ అని పేర్కొన్నారు.