Monday, September 15, 2025

పాక్‌పై ఘన విజయం.. అభిషేక్ నయా రికార్డు

- Advertisement -
- Advertisement -

దుబాయ్: ఆసియాకప్‌లో భాగంగా దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో భారత్.. పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్‌లో టీం ఇండియా స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma).. క్రీజ్‌లో ఉన్నంతసేపు పాక్ బౌలర్లను షేక్ ఆడించాడు. పాక్ బౌలర్లపై విరుచుకుపడ్డ అభిషేక్ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

టీం ఇండియా ఇన్నింగ్స్‌లో అభిషేక్ (Abhishek Sharma) తొలి బంతినే బౌండరీగా మలిచాడు. ఆ తర్వాతి బంతికి సిక్సర్‌ బాదాడు. ఇన్నింగ్స్‌లో 13 బంతులు ఎదురుకున్న అతడు.. 2 సిక్సులు నాలుగు ఫోర్లల సాయంతో 31 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఈ క్రమంలో ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. పాకిస్థాన్‌పై పవర్‌ప్లేలో అత్యధిక పరుగులు చేసి ఆటగాడిగా నిలిచాడు. గతంలో ఈ రికార్డు స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ పేరిట ఉండేది.

2022లో దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ 29 పరుగు చేశాడు. ఆ తరవ్ాత అదే వేదికగాపై అదే ఏడాది రోహిత్ శర్మ 28 పరుగులు, ఆ తర్వాత కెఎల్ రాహుల్ కూడా 28 పరుగులు చేశాడు. ఇప్పుడు వీరందరిని అభిషేక్ ఈ రికార్డును తన పేరిట రాసుకున్నాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 127 పరుగులు చేసింది. 128 పరుగుల విజయలక్ష్యాన్ని భారత్ 3 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసింది. దీంతో భారత్ ఈ మ్యాచ్‌లో 25 బంతులు మిగిలి ఉండగానే భారత్ విజయం సాధించిది.

Also Read : పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News