1.తెలంగాణ అస్తిత్వం అన్న మాటకి మీరు ఇచ్చే నిర్వచనం ఏమిటి?
తెలంగాణ వివిధ శ్రామిక కులాల, జాతుల సమాహారం. ఇందులో తెలంగాణ పాలిత, పాలక కులా ల రాజకీయ, ఆర్థిక, సామాజిక భాషా, సాంస్కృతిక అస్తిత్వాలున్నాయి.
తెలంగాణ శ్రామిక కులాల, జాతుల, తెగల ఆర్థిక రాజకీయ, సాంఘిక, భాషా, సంస్కృతుల విశిష్ట నిర్దిష్టతల ప్రాదేశికము తెలంగాణ అస్తిత్వం. తె లంగాణ భాషా సంస్కృతిని విశిష్ట అస్తిత్వంగా మాట్లాడుతుంటారు.
భాష వర్ణ, కుల, జెండర్, ప్రాదేశిక, మెజారిటీ, మైనారిటీ, మత, వయస్సుల, స్థిర, సంచార, అర్ధ సంచార జీవన స్వభావాలు కలిగి ఉంటుంది. అన్నింటికి మించి భాషకు రాజకీయ స్వభావం ఉంటుంది. పాలక, పాలిత సమూహాల భాషలు, శ్రామిక, యాజమాన్య సమూహాల భాషలు అనే భిన్న స్వభావ లక్షణాలను భాష కలిగి ఉంటుంది. భాష ఒకటే అయినప్పటికీ ప్రయోగించే నిర్దిష్ట వ్యక్తుల, బృందాలను బట్టి, సందర్భాలు, వాచ్యా ర్థం, భావార్ధాలతో భాష ఎప్పటికప్పుడు మారుతుంది. ఇలా చూసినప్పుడు తెలంగాణ ప్రాదేశికం లో శ్రామిక కులాలు, జాతులు, తెగలు మైనార్టీలు, మహిళలు, బాలల పరంగా ఉండే భాషా జీవన సాంస్కృతిక నిర్దిష్టతలు తెలంగాణ అస్తిత్వం.
2.సాహిత్య, సాంస్కృతిక, కళారంగాల్లో అస్తిత్వ, ప్రతిఫలం, ప్రయోజనం, విస్తృతి ఎలా ఉంది? ఎలా ఉండాలి అని మీరు అనుకుంటారు?
తెలంగాణ సాహిత్య, సాంస్కృతిక, కళారంగాల్లో తెలంగాణ అస్తిత్వ ప్రతిఫలం, ప్రయోజనం పాలక కులాలకే దక్కింది. పాలిత కులాలకు దక్కవలసిన ప్రతిఫలం, ప్రయోజనం శూన్యం.
తెలంగాణ మలిదశ ఉద్యమ కాలంలో, తెలంగాణ అస్తిత్వ చైతన్యంతో, సాహిత్య, సాంస్కృతిక కళా రంగాల విస్తృతి, ఉధృతి ఎంత ఎత్తుకు ఎగసినా, అది భౌగోళిక తెలంగాణకే పరిమితం చేసినయి పాలక కుల రాజకీయాలు.
ఇవే రాజకీయాలు ప్రత్యేక తెలంగాణ అస్తిత్వ బహుజన చైతన్య ఉద్యమ ఉధృతిని సామాజిక తెలంగాణ సాధన దిశకు చేరకుండా చేశాయి. తె లంగాణ సాహిత్య, సాంస్కృతిక, కళా రంగాలు సామాజిక ఉత్పత్తి శక్తులైన శ్రామిక ఎస్సీ, ఎస్టీ, బీ సీ, మైనారిటీ, జెండర్, ఆర్థిక, రాజకీయ ప్రజాస్వామిక, ప్రయోజన స్వభావం కలిగినవిగా ఉండాలి.
3.తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంత రం సృజన రంగంలో తెలంగాణ అస్తిత్వ పరిరక్షణకి, విస్తరణకి చోటు దొరికిందా? ఎలాంటి నూతన మార్పులు జరిగాయి అని అనుకుంటున్నారు?
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం సృజన రంగంలో తెలంగాణ అస్తిత్వ పరిరక్షణకు, విస్తరణకి, సబ్బండ సామాజిక కలాలకు, గళాలకు, కళలకు తగిన చోటు దొరకలేదు. ఇందువల్ల, చెప్పుకోదగ్గ ఎ లాంటి నూతన మార్పులు జరగలేదు. అం దుకే కాళోజీ చెప్పిన ‘దోపిడీ చేసే ప్రాంతేతరులను దూరం దాకా తన్ని తరుముతమ్, ప్రాంతం వాడే దోపిడీ చేస్తే ప్రాణంతోనే పాతర వేస్తం’ కార్యక్రమమున్నది.
4.మరీ ముఖ్యంగా గ్లోబలీకరణ అనం తర పరిస్థితుల్లో ప్రపంచ వ్యాప్తంగా సృజన రంగంలో, ఎంతో వేగవంతంగా, వివిధ రకాల సంస్కృతుల కలగలుపు జ రుగుతున్న స్థితి ఉంది. తెలంగాణ స్వీయ అస్తిత్వేతర సంస్కృతులు, సాహిత్య, కళారం గాల నుండి మంచిని తెలుసుకోవడం, నేర్చు కోవడం, తమ సృజనాత్మక రంగాల్లో సమ్మిళితం చేసుకోవడం అవసరం అని అనుకుంటున్నారా?
గ్లోబలీకరణ అనంతర పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా సృజన రంగంలో వివిధ రకాల సంస్కృతు ల కలగలుపు జరుగుతుందని చెప్పుతున్నది ఆధిప త్య దృష్టి నుంచి.
ఎందుకంటే కుల, జాతుల సమాజంలో స్పృహతో కలగలుపులు అనేవి ఎక్కడ జరగట్లేదు. జరుగుతున్నదల్లా భూస్వాములు కూలి వాళ్లతో, అమ్ముకునే వాళ్ళు కొనుగోలుదారులతో, పాలకులు పాలితులతో, యాజమాన్య కులాలు శ్రామిక కులాలతో, మగవాళ్ళు మహిళలతో -లాభాల, ప్రయోజనకరమైన అవసరార్థ, ఏకోన్ముఖ, ఏకపక్ష సంబంధాల చొరబాట్ల కలయికల, కలగలుపులు మాత్రమే జరుగుతున్నాయి.
అస్తిత్వేతరమైన ఆధిపత్య అగ్రహారాల, గ్రామ సంస్కృతులు, సాహిత్య కళా రంగాలు, అణగారి న అస్తిత్వ సమాజాలు నేర్చుకొని, తమ సృజనాత్మ క రంగాల్లో సమ్మిళితం చేసుకునేంత ప్రజాస్వామికంగా, గొప్పగా ఎక్కడున్నాయి?
శ్రామిక కులాలను, జాతులను తెగలను, జెండర్ల ను అంటరాని అమానవీయతలతో ద్వితీయం చేసి అణచివేసిన అస్తిత్వేతర సంస్కృతుల్లో, సాహిత్య, కళారంగాల్లో ఏమి మంచి ఉంటుంది?
అంత ఉన్నతి, మానవత్వం, వితరణ, నీతి, నైతిక త, సమానత, సహోదరత్వం నేర్చుకోగలిగిన ఉదాత్తతలు ఏమున్నయి?
అణగారిన అస్తిత్వ సమాజాలు నేర్చుకొని, తమ సృజనాత్మక రంగాల్లో సమ్మిళితం చేసుకోగల ఆదర్శాలు ఏమున్నాయి?
ముందు అస్తిత్వేతర ఆధిపత్య సంస్కృతు లు, సాహిత్య రంగాలు – వారి అన్ని రూపాల్లోని అణిచివేత స్వభావాల నుంచి తమని తాము సంస్కరించుకొని, మానవీకరించబ డి, డెమోక్రటైజ్ అయినప్పుడు, సామాజిక అస్తిత్వాలు వారి సాహిత్య కళారంగాల్లో మంచి ఉంటే నేర్చుకునే అవసరం రావొచ్చు.
5.తెలంగాణా అస్తిత్వం, సంస్కృతి పరి రక్షణ కోసం నిర్దిష్టంగా మీరు చేసే సూచ నలు ఏమిటి?
తెలంగాణ అస్తిత్వ సంస్కృతి అంటేనే అణగారిన కులాల, జాతుల, తెగల వెనకబడిన తరగతుల సంస్కృతులు. ఈ సమూహాలను సాధికారం కానీయకుండా వీరి సంస్కృతులను కాపాడలేరు. సాధికారంతోనే అస్తిత్వ సంస్కృతులను కాపాడుకోగలం. అట్లనే అస్తిత్వేతర సంస్కృతులు అస్తిత్వ సంస్కృతులకు రాజ్యాంగపరమైన, ప్రజాస్వామికమైన హక్కుల తావును కల్పించడం, సహానుభూతితో ఉండడం చాలా అవసరం. అయి తే ఆధిపత్య కులాలు డికాస్టీఫై కాకుండా ఉన్నంత వరకూ, అణగారిన అస్తిత్వ భాషా, సాహిత్య, సంస్కృతులు గాయపడుతూనే ఉంటాయి. భంగపడుతూనే ఉంటాయి.