Tuesday, September 16, 2025

లంచం తీసుకుంటూ ఎసిబికి దొరికిన తహసీల్దార్‌..

- Advertisement -
- Advertisement -

ఎసిబి అధికారులకు మరో అవినీతి తిమింగలం పట్టుబడింది. కరీంనగర్‌ జిల్లాలో లంచం తీసుకుంటుండగా ఓ తహసీల్దార్‌ ను ఎసిబికి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. శంకరపట్నం మండల తహసీల్దార్‌ కార్యాలయంలో శనివారం ఎసిబి అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి నుంచి రూ.6 వేల లంచం తీసుకుంటున్న తహసీల్దార్‌ మల్లేశంను అదుపులోకి తీసుకున్నారు. 2.25 గుంటల స్థలాన్ని నాలా కన్వర్షన్‌ కోసం ఎరడపల్లి గ్రామానికి చెందిన నవీన్‌రావు నుంచి లంచం డిమాండ్‌ చేశాడు. దీంతో అతను ఎసిబి అధికారులను ఆశ్రయించాడు. తర్వాత పక్కా ప్లాన్ ప్రకారం నవీన్‌రావు నుంచి లంచం తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News