Saturday, July 26, 2025

రాయికల్ తహసిల్దార్ ఆఫీసులో ఎసిబి దాడులు

- Advertisement -
- Advertisement -

జగిత్యాల జిల్లా, రాయికల్ తహసిల్దార్ కార్యాలయంలో మంగళవారం ఎసిబి అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్‌ఛార్జి తహసిల్దార్ గణేష్‌తో పాటు మధ్యవర్తిగా వ్యవహరించిన ప్రవేటు డాక్యుమెంట్ రైటర్ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని సింగరావుపేట గ్రామానికి చెందిన ఓ రైతు తన వ్యవసాయ భూమిని రిజిస్ట్రేషన్ చేయించు కోవడానికి ఇన్‌ఛార్జి తహసిల్దార్ గణేశ్‌ను సంప్రదించాడు. ఇందుకు ఆయన రూ. 15 వేలు లంచం కావాలని డిమాండ్ చేశాడు.

రాయికల్ పట్టణానికి చెందిన ప్రవేటు డాక్యుమెంట్ రైటర్ ముజాఫర్ ఇందులో మధ్యవర్తిగా వ్యవరించి రూ.10 వేలకు ఒప్పందం కుదిర్చాడు. ఈ క్రమంలో బాధిత రైతు ఎసిబిని సంప్రదించాడు. కరీంనగర్ ఎసిబి డిఎస్‌పి విజయ్‌కుమార్ తహసిల్దార్ కార్యాలయంపై మంగళవారం ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. మధ్యవర్తిగా వ్యవహరించిన ముజాఫర్, రూ.10 వేల లంచం తీసుకుంటున్న ఇన్‌ఛార్జి తహసిల్దార్ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. కాగా, వారిద్దర్నీ రిమాండ్‌కి తరలించినట్లు ఎసిబి డిఎస్‌పి విజయ్‌కుమార్ వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News