Sunday, May 18, 2025

గొర్రెల పంపిణీ స్కామ్..ప్రధాన నిందితుడి ఇంట్లో సోదాలు

- Advertisement -
- Advertisement -

మొయినుద్దీన్ నివాసంలో ఎసిబి
తనిఖీలు ప్రస్తుతం కుమారుడితో
సహా దుబాయ్‌లో ఉన్న ప్రధాన
నిందితుడు రూ.700కోట్ల
కుంభకోణంపై మళ్లీ కదలిక

మన తెలంగాణ/హైదరాబాద్: గొర్రెల పంపిణీ స్కామ్‌లో కీలక నిందితుడు ఖాజా మొయినుద్దీన్ ఇంట్లో ఎసిబి గురువారం సోదాలు నిర్వహిం చింది. మొత్తంగా రూ.700 కోట్ల స్కామ్ జరిగిందని, ఈ స్కామ్‌లో ప్రధాన నిందితుడిగా మెయినుద్దీన్. కాగా, మెయినుద్దీన్, అతని కుమారుడు ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్నారు. లబ్దిదారులకు పంపిణీ చేయాల్సిన గొర్రెలకు కేటాయించిన ని ధుల్ని పక్కదారి పట్టించారనే ఆరోపణలతో తొలు త గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేయగా.. అధికారుల అమ్యామాల అంశం ముడిపడి ఉండటంతో ఎసిబి ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది.

పశుసంవర్ధక శాఖ అధికారులు తెలుంగాణలోని లబ్దిదారులను ఆంధ్రప్రదేశ్‌కు తీసుకెళ్లి అక్కడి విక్రయదారుల నుంచి గొర్రెలను కొనుగోలు చేయించారు. విక్రేతలకు చెల్లించాల్సిన డబ్బులను బినామీ ఖాతాలకు మళ్లించారు. బ్రోకర్లను, ప్రైవేటు వ్యక్తులను ఏర్పాటు చేసుకుని రూ.2.1కోట్లను మళ్లించినట్లు తేలడంతో నిధులు ఏమయ్యాయనే కోణంలో ఎసిబి దర్యాప్తు కొనసాగింది. బినామీ ఖాతాదారులను విచారిం చగా బ్రోకర్లు, అధికారుల పాత్రపై ఆధారాలు లభ్యమయ్యాయి. ఈ కుంభకోణంలో గొర్రెల కొనుగోలు కాంట్రాక్టర్‌గా వ్యవహరించిన మొయిను ద్దీన్ కీలకంగా వ్యవహరించినట్లు ఎసిబి అధికారులు గుర్తించారు. మొయినుద్దీన్‌ను అరెస్ట్ చేసేలోగానే అతడు దుబాయ్‌కు ఉడాయించాడు. అనంతర కాలంలో రూ.700 కోట్ల స్కామ్ జరిగిందని అధికారులు గుర్తించారు.’

2015లో పథకం ప్రారంభం
2015లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం గొర్రెల పం పిణీ పథకాన్ని ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా వేల మంది లబ్దిదారులకు దాదాపు రూ.4 వేల కోట్ల విలువైన గొర్రెలను పంపిణీ చేసినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ పథకంలో మొదట్నించీ అధికారులు, దళారులు కుమ్మక్కై నిధులు స్వాహా చేసినట్లు ఎసిబి దర్యాప్తులో ఈ పాటికే వెల్లడైంది. కొంతమంది విక్రేతలకు డబ్బులు చెల్లించినట్లు రికార్డులో చూపించి, ఆ నిధుల్ని ఈ ముఠా స్వాహా చేసింది. ఈ నిధుల్ని బినామీ ఖాతాల్లోకి మళ్లించి అంతా కలిసి వాటాలు పంచుకన్నట్లు వెల్లడైంది. ఈ క్రమంలో ఎసిబి అధికారులు దాదాపు రూ.700 కోట్ల ఈ స్కామ్‌కు సంబంధించి ప్రధాన నిందితుడైన మొయినుద్దీన్ ఇంట్లో తాజాగా సోదాలు నిర్వహించింది. మరోవైపు ఈ కేసులో మొయినుద్దీన్ చిక్కితే పూర్తి చిక్కుముడులు వీడే అవకాశం ఉందని ఎసిబి అధికారులు భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News