Sunday, July 20, 2025

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్.. మిథున్‌ రెడ్డికి రిమాండ్

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో వైసిపి ఎపి మిథున్ రెడ్డికి (Midhun Reddy) విజయవాడ ఎసిబి కోర్టు రిమాండ్ విధించింది. ఆగస్టు 1 వరకూ రిమాండ్ విధిస్తూ.. ఆదేశాలు జారీ చేసింది. దీంతో మిథున్ రెడ్డిని పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలిస్తున్నారు. ఎపి లిక్కర్ స్కామ్‌లో ఎ4గా ఉన్న మిథున్ రెడ్డిని శనివారం సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఆదివారం ఉదయం ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి.. విజయవాడ ఎసిబి కోర్టు ఎదుట హాజరుపరిచారు. మిథున్ రెడ్డి అరెస్టుకు 29 కారణాలను సిట్ అధికారులు కోర్టుకు నివేదించారు. సెక్షన్ 409, 420, 120(బి), రెడ్‌విత్ 34, 37, ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ యాక్టు 7, 7ఎ, 8, 13(2) కింద కేసు నమోదు చేసినట్లు సిట్ అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News