Wednesday, May 28, 2025

కెటిఆర్‌కు ఎసిబి నోటీసులు

- Advertisement -
- Advertisement -

ఫార్ములా ఇ కారు రేస్ కేసులో జారీ 28న
విచారణకు హాజరు కావాలని ఆదేశం అమెరికా,
బ్రిటన్ పర్యటన తరువాత హాజరవుతానని తెలిపిన
కెటిఆర్ కక్ష సాధింపులో భాగంగానే నోటీసులు :
కవిత సత్యమే గెలుస్తుందని హరీశ్ వ్యాఖ్య

మన తెలంగాణ/హైదరాబాద్ : హైదరాబాద్‌లో నిర్వహించిన ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌కు అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) నోటీసులు జారీ చేసింది. ఈ నెల 28న (బుధవా రం) విచారణకు హాజరు కావాలని ఎసి బి అధికారులు కెటిఆర్‌ను ఆదేశించిన ట్లు సమాచారం. ఫార్ములా ఈ రేస్ నిర్వహణలో అక్రమాలు జరిగాయని, దీని ద్వారా రాష్ట్ర ఖజానాకు భారీ నష్టం వా టిల్లిందని గత కొంతకాలంగా ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ ఆరోపణల నేపథ్యంలోనే ఎసిబి అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ దర్యాప్తులో భాగంగానే కెటిఆర్‌కు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసులో గతంలో కొంతమంది అధికారులు, నిర్వాహకులపై కూడా ఎసిబి దృష్టి సారించినట్లు సమాచారం.

యుకె, యుఎస్‌ఎ నుంచి వచ్చాక విచారణకు హాజరవుతా : కెటిఆర్
ఫార్ములా ఈ కేసులో ఈ నెల 28న విచారణకు హాజరుకావాలన్న ఎసిబి నోటీసులపై బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. రాజకీయంగా వేధించే ఉద్దేశ్యంతో తనపై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసు పెట్టిందన్న సంగతి తెలిసినప్పటికీ చట్టాన్ని గౌరవించే పౌరుడిగా విచారణ సంస్థలకు పూర్తిగా సహకరిస్తానని స్పష్టం చేశారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, బిఆర్‌ఎస్ రజతోత్సవ కార్యక్రమాలకు హాజరయ్యేందుకు లండన్, అమెరికా పర్యటన ముందే ఖరారైనందున ఈనెల 28న విచారణకు హాజరుకాలేనని పేర్కొన్నారు. అయితే, విదేశాల నుంచి తిరిగి వచ్చిన తరువాత కచ్చితంగా విచారణకు వస్తానని ఎసిబి అధికారులకు కెటిఆర్ లిఖితపూర్వకంగా తెలియజేశారు. 48 గంటల క్రితం నేషనల్ హెరాల్డ్ కేసులో మనీలాండరింగ్ ద్వారా డబ్బులు ఇచ్చినందుకు రేవంత్ రెడ్డి పేరును ఇడి ఛార్జిషీట్‌లో నమోదు చేసిందని,

సరిగ్గా 24 గంటల తర్వాత ప్రధాని మోడీతో సహా బిజెపి అగ్ర నాయకులతో రేవంత్ రెడ్డి సన్నిహితంగా కనిపించారని వెల్లడించారు. మనీలాండరింగ్ కేసులో రేవంత్ రెడ్డి పేరును ఇడి పేర్కొన్నప్పటికీ ఒక్క తెలంగాణ బిజెపి నేత కూడా అతన్ని ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం.. ఆ రెండు పార్టీల మధ్య ఉన్న అవగాహనకు, అనైతిక సంబంధానికి నిదర్శనమని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ తప్పిదాలు, అరాచకాలను ప్రశ్నిస్తున్నందుకు రగిలిపోతున్న రేవంత్ రెడ్డి.. తనపై ప్రతీకారంతో ఎంతకైనా దిగజారుతారన్న సంగతి ఈ ఎసిబి నోటీసులతో అర్థం అయిందని కెటిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి నాయకుడిగానే కాకుండా, మనిషిగా కూడా ఎంతగా పతనం అవుతున్నారో చెప్పడానికి ఈ చౌకబారు ప్రతీకార చర్యలే నిదర్శనం వ్యాఖ్యానించారు. బిఆర్‌ఎస్‌ను చూస్తే రేవంత్‌లో రోజురోజుకూ భయం పెరిగిపోతోందని స్పష్టంగా అర్థమవుతోందని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News