Friday, July 18, 2025

మురళీధర్‌ రావును కస్టడీ కోరుతూ ఎసిబి పిటిషన్‌

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నీటి పారుదల శాఖ విశ్రాంత ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధరరావును ఏడు రోజులు కస్టడీకి కోరుతూ ఎసిబి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. గురువారం ఎసిబి అధికారులు వేసిన ఈ పిటిషన్ పై శుక్రవారం న్యాయస్థానం విచారణ జరపనుంది. కాగా, కాళేశ్వరం ప్రాజెక్టులో మురళీధర్‌రావు కీలకంగా వ్యవహరించిన విషయం తెలిసిందే. కాళేశ్వరం ప్రాజెక్టు సబ్ కాంట్రాక్టుల కేటాయింపుల్లో భారీగా అవకతవకలు జరిగినట్టు ఎసిబికి ఫిర్యాదులు వచ్చాయి. వాటి ఆధారంగా బంజారాహిల్స్‌లో మురళీధరరావు నివాసంలో మంగళవారం తెల్లవారుజాము నుంచి ఎసిబి అధికారులు సోదాలు నిర్వహించారు.

ఏక కాలంలో హైదరాబాద్, కరీంనగర్, జహీరాబాద్ ప్రాంతాలలో ఆయనకు సంబంధించిన పది చోట్ల ఎసిబి అధికారులు సోదాలు నిర్వహించారు. ఆయనకు సంబంధించిన కుటుంబసభ్యులు, బంధువుల ఇళ్లల్లో కూడా తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో భారీగా అక్రమ ఆస్తులను ఎసిబి అధికారులు గుర్తించారు. దీంతో మురళీధర్ రావును ఎసిబి అధికారులు అరెస్ట్ చేశారు. ఎసిబి సోదాలలో కీలక పత్రాలు, ఆస్తులకు సంబంధించిన పత్రాలు లభించినట్లు సమాచారం. ఆక్రమ కేసులో అరెస్టైన మురళీధర్ రావు ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News