Thursday, September 18, 2025

అక్రమాస్తుల కేసు.. చంచల్‌గూడ జైలుకు చేవెళ్ల విద్యుత్ శాఖ ఎడిఇ

- Advertisement -
- Advertisement -

చేవెళ్ల విద్యుత్ శాఖ ఎడిఇ రాజేష్ ఇంట్లో ఎసిబి సోదాలు
బాత్రూమ్‌లో రూ.20 లక్షల రూపాయల నగదు సీజ్
విద్యుత్ శాఖ ఎడిఇ అంబేడ్కర్‌కి 14 రోజుల రిమాండ్, చంచల్‌గూడ జైలుకు తరలింపు
అక్రమాస్తులు 200 కోట్లకు పైనే.. రిమాండ్ రిపోర్టులో వెల్లడి
మన తెలంగాణ/హైదరాబాద్: విద్యుత్తు శాఖ ఎడిఇ అంబేద్కర్ సన్నిహితులు, బినామీల ఇళ్లలో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. చేవెళ్ల విద్యుత్తు శాఖ ఎడిఇ రాజేష్ ఇంట్లో ఎసిబి అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. అయితే ఈ సోదాల్లో రాజేష్ ఇంట్లోని బాత్ రూంలో ఇరవై లక్షల రూపాయల నగదును ఎసిబి అధికారులు కనుగొన్నారు. వాటిని సీజ్ చేశారు. నిన్న విద్యుత్తు శాఖ ఎడిఇ అంబేద్కర్ ఇంట్లోనూ, ఆయన కుటుంబసభ్యులు, సన్నిహితులు, బినామీల ఇళ్లలో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహిం చిన నేపథ్యంలో అనేక అక్రమాస్తులు బయటపడ్డాయి. కోటి రూపాయల నగదు బినామీ ఇంట్లో పట్టుబడింది. దీంతో ఎసిబి అధికారులు మరికొం దరు బినామీల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు.

విద్యుత్ శాఖ ఎడిఇ అంబేడ్కర్‌కి 14 రోజుల రిమాండ్, చంచల్‌గూడ జైలుకు తరలింపు
మణికొండ విద్యుత్ శాఖ ఎడిఇ అధికారి అంబేడ్కర్‌ను ఎసిబి అధికారులు నాంపల్లి ఎసిబి కోర్టు జడ్జి ఎదుట హాజరుపర్చారు. అంబేడ్కర్‌కు న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధిం చడంతో ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించారు. అంబేడ్కర్ ఆయన బంధువుల ఇళ్లలో 15 చోట్ల ఎసిబి అధికారులు సోదాలు నిర్వహిం చారు. అంబేడ్కర్‌కు హైదరాబాద్‌లో ఆరు ప్లాట్లు, గచ్చిబౌలిలో ఐదంతస్తుల భవనం, వెయ్యిగజాల స్థలం, సూర్యాపేటలో పదెకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు గుర్తించారు. అంబేడ్కర్ ఇంట్లో బంగారం, బ్యాంకులో రూ.78 లక్షల ఉన్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అంబేడ్కర్‌ను మంగళవారం అరెస్టు చేశారు. బుధవారం ఉదయం జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు.

అక్రమాస్తులు 200 కోట్లకు పైనే.. రిమాండ్ రిపోర్టులో వెల్లడి
ఎడిఇ అధికారి అంబేడ్కర్ రిమాండ్ రిపోర్ట్‌లో కీలక అంశాలను పోలీసులు పొందుపర్చారు. ఎడిఇ అంబేద్కర్ అక్రమాస్తులు 200 కోట్లకు పైగా ఉన్నట్టు గుర్తించినట్లు స్పష్టపర్చారు. అంబేద్కర్ బినామీ సతీష్ ఇంట్ల 2.58 కోట్ల రూపాయల నగదు లభ్యం కావడం ఎసిబి చరిత్రలో ఇంత మొత్తం లో డబ్బు దొరకటం మొదటిసారని పోలీసులు వెల్లడిం చారు. ప్రభుత్వ అధికారిగా ఉంటూ అంబేడ్కర్ కెమికల్ ఫ్యాక్టరీని నెలకొల్పాడని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.

సూర్యాపేటలో అమ్థర్ కెమి కల్స్‌ను రెండు సంవత్సరాల క్రితమే ఏర్పాటు చేసి కెమికల్స్ పేరుతో ఇథనాల్ తయారీ చేస్తున్నారు. దీనికి అంబేడ్కర్ కంపెనీ డైరెక్టర్‌గా ఉన్నారు. అంబేద్కర్ అధిక పనులు బినామీలతోనే చేయించారు. బినామీలకు కాంట్రాక్టులు పనులు ఇప్పించి పని మొత్తం తానే చూసుకున్నాడు. కొన్ని నెలల క్రితమే అంబేడ్కర్ పై విజిలెన్స్ విచారణ కూడా జరిగింది. గతంలో జిహెచ్‌ఎంసిలో ఎఇగా పనిచేసిన అంబేద్కర్ డిస్కంలో పటాన్ చెరు, కెపిహెచ్‌బి, గచ్చిబౌలిలో పనిచేయటంతో అధిక మొత్తంలో అక్రమ ఆస్తులు కూడా అర్జించారని ఆరోపణలున్నాయి. ఐటి కారిడార్‌లో వైరస్ బిల్డిం గ్‌లకు విద్యుత్ కనెక్షన్ల జారి సమయంలో పెద్ద ఎత్తున ముడుపులు తీసుకున్నట్లు ఫిర్యాదులొచ్చాయి. కనెక్షన్ ఇచ్చేందుకు లోడ్ సరిపోదని సాకు చెబుతూ వారి వద్ద నుంచి కోట్లలో లంచం తీసుకున్నట్టు ఆరోపణలున్నాయి. పలుమార్లు అంబేడ్కర్ పై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. వట్టినాగులపల్లిలో వివాదంలో ఉన్న వెంచర్కు కనెక్షన్ ఇవ్వద్దని హైకోర్టు ఆదేశాలు ఉన్న బేఖాతారూ చేసినట్లు ఫిర్యాదులొచ్చాయి.

Also Read: కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే సర్కార్ సంకల్పం: పిసిసి చీఫ్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News