Saturday, July 5, 2025

కోటపల్లి తహాసిల్దార్ ఆఫీస్‌లో ఎసిబి దాడులు

- Advertisement -
- Advertisement -

జిల్లాలోని కోటపల్లి మండలంలో పట్ట పాస్‌పుస్తకంలో దొర్లిన తప్పులను సవరించేందుకు ఒక రైతు వద్ద డబ్బులు డిమాండ్ చేసిన డిప్యూటీ తహాసిల్దార్ నవీన్‌కుమార్, అంజి అనే వ్యక్తిని ఎసిబి అధికారులు శుక్రవారం వల పన్ని పట్టుకున్నారు. భీమారం మండలానికి చెందిన ఒక రైతుకు సంబంధించిన భూమి రాజారాం శివారులో 20 గుంటల భూమి ఉంది. పట్టా పాస్ పుస్తకంలో తప్పులు దొర్లడంతో సరిచేయాలని బాధిత రైతు దరఖాస్తు చేశాడు. అయితే, అందుకు డిప్యూటీ తహసిల్దార్ నవీన్‌కుమార్ రూ.15 వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేయగా తన వద్ద లేవని ఆ రైతు వెళ్లిపోయాడు.

దీంతో మరునాడు డిటి ఫోన్ చేయగా తన వద్ద అంత డబ్బు లేదని చెప్పాడు. అయితే, ఆఫీసుకు రావాలని..మాట్లాడుకుందాం అని డిటి చెప్పటడంతో బాధిత రైతు వెళ్లాడు. తనకు రూ.10 వేలు ఇవ్వాలని డిమాండ్ డిటి చేయడంతో బాధితుడు ఎసిబిని ఆశ్రయించాడు. శుక్రవారం ఎసిబి డిఎస్‌పి మధు (ఆదిలాబాద్) మండల రెవెన్యూ కార్యాలయంలో డిటి నవీన్‌కుమార్‌తో పాటు అటెండర్ స్థానంలో ఉన్న అంజి అనే వ్యక్తి శుక్రవారం రైతు నుండి డబ్బులు తీసుకుంటుండగా అదుపులోకి తీసుకున్నారు. నిందితులను ఎసిబి కోర్టులో అప్పగించనున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News