Saturday, August 23, 2025

ఎసిబి వలలో అవినీతి తిమింగలం

- Advertisement -
- Advertisement -

కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ బాలునాయక్ ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నాడనే ఫిర్యాదుల మేరకు అవినీతి నిరోధక శాఖ అధికారులు కేశవాయన గుంటలోని ఆయన ఇంటితోపాటు కడప అన్నమయ్య జిల్లా కర్నూల్ లలోని 8 చోట్ల ఏకకాలం గా ఏసిపి అధికారులు సోదాలు చేశారు. ఈ సోదాలలో పలు స్థిరాస్తులకు చెందిన దస్తావేజులతోపాటు బంగారు వెండి నగదును స్వాధీనం చేసుకున్నారు. వివరాలలోకి వెళితే .. బాలు నాయక్ కర్నూలు కేంద్రంగా కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఈయన పరిధిలోకి రాయలసీమలోని నాలుగు ఉమ్మడి జిల్లాలు వస్తాయి. గతంలో బాలు నాయక్ తిరుపతిలోని కార్మిక శాఖ కార్యాలయంలో సహాయ కమిషనర్ గా కూడా విధులు నిర్వహించారు. ఆయన ఆదాయానికి మించిన ఆస్తులు కూడ పెట్టారని, ఇటీవల అవినీతి నిరోధక శాఖ అధికారులకు పలు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో ఆయన తిరుపతిలోని కేశవాయనగుంట ఇంటిలో ఉన్న సమయంలోనే ఈ సోదాలు జరిగాయి.

అవినీతి నిరోధక శాఖ అడిషనల్ ఎస్పి విమల కుమారి నేతృత్వంలో డీఎస్పీ జెస్సీ ప్రశాంతి, కడప అనంతపురం కర్నూలు జిల్లాలకు చెందిన ఏసిపి అధికారులు ఈ సోదాలలో పాల్గొన్నారు. తిరుపతిలోని బాలు నాయక్ ఇంటితోపాటు మిగిలిన చోట్ల ఆయనకు చెందిన బంధువులు, స్వగ్రామంతో పాటు అన్నిచోట్ల ఏకకాలంలో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. బాలు నాయకకు తిరుపతిలో ఒక నివాస గృహముతో పాటు మెడికల్ సర్జికల్ షాపును కూడా నిర్వహిస్తున్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఇంటితోపాటు స్థిరాస్తులు, సంబేపల్లి సమీపంలో కోళ్ల ఫారం, కర్నూలు జిల్లాలో రెండు చోట్ల ఆస్తులకు సంబంధించిన పలు రికార్డులను బంగారు, వెండి నగలను స్వాధీనం చేసుకున్నారు. రాత్రి పొద్దుపోయేంతవరకు ఏఎస్పి విమల కుమారి నేతృత్వంలో అధికారులు సోదాలు చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం బాలు నాయక్ ఏసీబీ అధికారుల అదుపులో ఉన్నారు. పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని ఏసిబి ఏ ఎస్ పి విమల కుమారి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News