మన తెలంగాణ/సిటీ బ్యూరో/భద్రాద్రి కొత్తగూడెం/మర్కుక్: తెలంగాణలో మరోసారి ఎసి బి సోదాలు చేపట్టడం తీవ్ర కలకలం సృష్టించిం ది. ఇరిగేషన్ మాజీ ఈఎన్సీ హరిరాం ఇంటిపై ఏసీబీ అధికారులు శనివారం తెల్లవారుజాము నుంచి సోదాలు నిర్వహించారు. ఏక కాలంలో 14 చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టా రు. ఇరిగేషన్ మాజీ ఈఎన్‌సి హరిరాం ఇంట్లో ఎసిబి అధికారులు శనివారం తెల్లవారుజాము నుంచి సోదాలు నిర్వహించారు. హరిరాం కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో కీలకంగా వ్యవహరించారు. షేక్‌పేటలోని హరిరాం ఇంట్లో తనిఖీల్లో భారీగా ఆస్తిపత్రాలు అధికారులు స్వాధీనం చేసుకున్నా రు. మార్కుక్ మండలంలో 28 ఎకరాల వ్యవసా య భూమి,షేక్‌పేట్, కొండాపూర్‌లో విల్లాలు, శ్రీనగర్ కాలనీ, మాదాపూర్, నార్సింగిలో ఫ్లా ట్లు, అమరావతిలో వాణిజ్య సముదాయం, మ ర్కుక్ మండలంలో 28 ఎకరాల వ్యవసాయ భూమి, పటాన్ చెరువులో 20 గుంటల భూమి, శ్రీనగర్ కాలనీ, హైదరాబాద్‌లో రెండు ఇండిపెండెంట్ ఇళ్లు, గాజుల రామారంలో ఆరు ఎకరాల్లో ఫాంహౌజ్, కొత్తగూడెంలో నిర్మాణంలో ఉన్న ఇల్లు, కుత్బుల్లాపూర్, మిర్యాలగూడలో ఓపెన్ ప్లాట్ ఉన్నట్లు ఎసిబి అధికారులు గుర్తించారు.
రెండు కార్లు, అందులో ఒకటి బిఎండబ్లూ కారు ఉంది. మూడు బ్యాంక్ లాకర్లు ఉన్నట్లు ఎసిబి అధికారులు గుర్తించారు. ఆదాయానికి మించి అక్రమాస్తుల కేసులో భూక్యా హరిరాం నాయక్‌ను అరెస్టు చేసిన పోలీసులు నాంపల్లిలోని ఎసిబి కోర్టులో హాజరుపర్చారు. కోర్టు హరిరాం నాయక్‌కు రిమాండ్ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఈఎన్‌సిగా పనిచేసిన హరిరాం నాయక్ భారీగా ఆస్తులు కూడా బెట్టినట్లు ఎసిబి అధికారులకు తెలియడంతో సోదాలు నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో పలు లోపాలు ఉన్నా కూడా ఈఎన్‌సిలుగా వ్యవహరించిన వారు ఎలాంటి అభ్యంతరం తెలుపకుండా, మామూళ్లు తీసుకుని అనుమతులు ఇచ్చినట్లు తెలిసింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణ లోపాలపై ఎన్‌డిఎస్‌ఏ రిపోర్టు ఇవ్వడంతో ఈ విషయాలు బయటపడ్డాయి. దీంతో ప్రాజెక్ట్ కోసం పనిచేసిన అధికారులు,ఈఎన్‌సిలపై ఎసిబి అధికారులు నజర్ పెట్టారు. ఈఎన్‌సి హరిరాం ఇంటిపై ఎసిబి అధికారులు దాడి చేయడంతో, ప్రాజెక్ట్‌లో కీలకంగా వ్యవహరించిన అధికారులు తమపై కూడా ఎసిబి అధికారులు దాడి చేస్తారని ఆందోళన చెందుతున్నట్లు తెలిసింది.
హరిరాం బంధువుల ఇళ్లల్లో సోదాలు…
భద్రాద్రి కొత్తఏగూడెం జిల్లాలోని లక్ష్మీ దేవిఏపల్లి మండలం, ఎదురుగ-డ్డలో ఇరిగేషన్ డిపాఏర్ట్‌ఏమెంట్ కాళేశ్వరం ఇంజనీర్ ఇన్ చీఫ్ భూక్యా హరిరాం బంధువుల ఇళ్లలో శనివారం ఉదయం 5.30 గంటల నుంచి ఎసిబి డిఎస్‌పి వై.రమేష్ ఆధ్వర్యంలో సోదాలు కొనసాగుతున్నాయి. భూక్యా హరిరాం సొంతూరు ఎదురుగడ్డ. ఆయనకు ఇక్కడ నివాసం ఉంది. హైదరాబాద్‌లోని ఆయన ఇంటిపై ఇదే సమయంలో ఎసిబి దాడులు కొనసాగుతున్న క్రమంలోనే ఇక్కడ కూడా ఆయన బంధువుల ఇళ్లలో తనిఖీలు జరిగాయి.
మర్కుక్ తహసిల్దార్ కార్యాలయంలో…
సిద్దిఏపేట జిల్లా, మర్కుక్ తహసిల్దార్ కార్యాలయంలో శనివారం ఎసిబి అధికారులు ఎన్‌డిఎస్ రిపోర్టు ఆధారంగా తనిఖీలు నిర్వహించారు. మెదక్ ఎసిబి ఎస్‌పి సుదర్శన్, ఇన్స్‌స్పెక్టర్ కొండా రమేష్, వెంకటేశ్వర్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరిగాయి. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకపాత్ర వ్యవహరిం-చిన ఇరిగేషన్ ఇఎన్‌సి హరీరామ్, ఆయన భార్య అనిత నీటిపారుదల శాఖలో డిప్యూటీ ఇఎన్‌సి అధికారిగా విధులు నిర్వ-హించారు. మర్కుక్ మండల పరిఏధిలో హరీరామ్ దాదాపు 100 ఎకఏరాల వరకు భూమిని కొనుఏగోలు చేశారని అంచనా వేశారు. ఆయన భార్య అనిత పేరుపై 32 ఎకరాలు ఉన్నట్లు నిర్ధారించారు. ఏకకాలంలో ఎక్కువ మొత్తంలో భూమి కొనుగోలు చేశారని నిర్ధారణ జరిగిన తర్వాతనే ఈ తనిఏఖీలు నిర్వహించామని ఎసిబి ఎస్‌పి తెలిపారు. కేవలం మర్కుక్ మండలంలోనే కాకుండా ఒకే సమయంలో మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 14 చోట్ల ఎసిబి అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారని తెలిపారు.