Thursday, September 4, 2025

ఎస్‌ఎల్‌బిసిపై వెనుకడుగు లేదు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్:శ్రీశైలంలెఫ్ట్ బ్యాం క్ కెనాల్(ఎస్‌ఎల్‌బిసి) ప్రాజెక్టును పూర్తి చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెనకడుగు వేసే ప్ర సక్తే లేదని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కు మార్ రెడ్డి స్పష్టం చేశారు. ఎస్‌ఎల్‌బిసి పనుల పు నరుద్ధరణపై గురువారం సిఎం రేవంత్ రెడ్డితో స మావేశం కానున్నట్లు తెలిపారు. ఎస్‌ఎల్‌బిసి పు నరుద్ధరణ పనుల పురోగతిపై బుధవారం సచివాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీశైలం నుంచి 824 అడుగుల నుంచి ఎస్.ఎల్.బి.సి సొరంగ మార్గానికి నీరు వస్తుండ గా 840 అడుగుల నుంచి పోతిరెడ్డిపాడుకు నీ రు చేరుతుందని ఎస్‌ఎల్‌బిసి పూర్తి అయితే ఆం ధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా పోతిరెడ్డిపాడు కు నీటిని తరలించుకు పోయో అవకాశమే ఉం డదని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్టును పూర్తి చే యాలని సంకల్పించిందని,

ఆధునిక పరిజ్ఞానా న్ని వినియోగించి త్వరితగతిన పనులు పూర్తి చే సేందుకు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఎస్‌ఎల్‌బిసి పునరుద్దరణ  ప్రణాళికపై గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో సమావేశం కానున్నట్లు మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. ఇకపై నెలకు 178 మీటర్ల సొరంగం తవ్వడం లక్ష్యంగా పెట్టుకుని జనవరి 2028 నాటికి ప్రాజెక్టును పూర్తి చేయనున్నట్లు ప్రకటించారు. మొత్తం 44 కిలోమీటర్ల సొరంగమార్గానికి గాను ఇప్పటికే 35 కిలో మీటర్ల సొరంగం తవ్వడం పూర్తి అయ్యిందని, మిగిలిన తొమ్మిది కిలోమీటర్ల సొరంగ మార్గం తవ్వడానికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించ బోతున్నట్లు ఆయన తెలిపారు. ఇందు కోసం ప్రపంచంలోనే అత్యాధునిక సాంకేతికతో కూడిన హెలీ-బోర్న్ సంస్థతో సర్వే నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చ్ ఇనిస్ట్యూట్(ఎన్‌జిఆర్‌ఐ)ద్వారా ఈ సర్వే నిర్వహిస్తామన్నారు. దీనిద్వారా సొరంగ మార్గం తవ్వకాల సమయంలో ప్రమాదాలను ముందుగానే పసిగట్టే వెసులుబాటు ఇంజినీర్లకు ఉంటుందని తెలిపారు. నీటిపారుదల సలహా దారుడిగా లెఫ్టినెంట్ జెనరల్ హార్పల్ సింగ్ నియామకం ఈ సొరంగ మార్గం పూర్తికి దోహద పడుతుందన్న ఆశాభావాన్ని మంత్రి వ్యక్తం చేశారు. రెండువైపులా మొదలు పెట్టిన ఎస్‌ఎల్‌బిసి సొరంగ మార్గం తవ్వకాలలో ఒక భాగం నుంచి 21 కిలోమీటర్లు పూర్తి కాగా మరో వైపు 14 కిలో మీటర్లు పూర్తి అయ్యిందని మిగిలిన తొమ్మిది కిలోమీటర్లు పూర్తికి మూడు షిఫ్ట్ లలో పనిచేసేవిధంగా ప్రణాళికలు రూపొందించుకోనున్నట్లు తెలిపారు. ఎస్‌ఎల్‌బిసి సొరంగ మార్గం తవ్వకాల సమయంలో ఉబికి వస్తున్న నీటిని పంపింగ్ చేయడానికి విద్యుత్ బిల్లులు సంవత్సరానికి దాదాపు రూ.500 కోట్లు చెల్లిస్తున్నట్లు చెప్పారు. పంపింగ్ కోసం వినియోగిస్తున్న మోటార్లు 20 సంవత్సరాలు పూర్తి కావడంతో అదనపు భారాన్ని భరిస్తూ మోటార్లను మార్చాల్సి వస్తుందన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే రోజుకు 0.3 టియంసి ల నీటిని 90 రోజుల పాటు అందించవచ్చన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News