Friday, May 2, 2025

ఇడి అధికారులమంటూ నగదు, బంగారంతో ఉడాయింపు

- Advertisement -
- Advertisement -

 

ముంబై: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఇడి) అధికారులమంటూ ఒక వ్యాపారి కార్యాలయంలోకి మంగళవారం చొరబడిన నలుగురు మోసగాళ్లు రూ. 25 లక్షల నగదు, 3 కిలోల బంగారంతో ఉడాయించారు. జవేరీ బజార్ ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. దాడి పేరుతో నకిలీ ఇడి అధికారులు ఎత్తుకెళ్లిన నగదు, బంగారం మొత్తం విలువ రూ. 1.70 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. నలుగురు గుర్తు తెలియని వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేసి వారి కోసం గాలిస్తున్నారు. ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని ఎల్‌టి మార్గ్ పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News