Monday, September 15, 2025

నిందితుడు ప్రెజర్ కుక్కర్ బాంబు వాడాడు: కర్నాటక సిఎం

- Advertisement -
- Advertisement -

రామేశ్వరం పేలుడు కేసులో నిందితుడు ప్రెజర్ కుక్కర్ బాంబు వాడాడని ముఖ్యమంత్రి సిద్దరామయ్య చెప్పారు. ఉగ్రవాద చర్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని, ఈ సంఘటనపై రాజకీయాలు చేయకూడదని అన్నారు. అయితే దీనిని బిజెపి రాజకీయ స్వప్రయోజనాలకోసం వాడుకుంటోందన్నారు. ఒక వ్యక్తి మాస్క్, టోపీ పెట్టుకుని కేఫ్ కు వచ్చి రవ్వ ఇడ్లీ ఆర్డర్ ఇచ్చాడని, తర్వాత బాంబుకు టైమర్ సెట్ చేసి వెళ్లిపోయాడని ముఖ్యమంత్రి చెప్పారు. నిందితుడి పోటోలు వచ్చాయనీ, సాధ్యమైనంత త్వరగా పట్టుకుంటామని తెలిపారు. బాంబు పేలుడు ఘటనలో పదిమంది గాయపడ్డారని ఆయన చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News