Thursday, August 21, 2025

ఘాటీల జీవనశైలి, సంస్కృతిని చూపిస్తూ..

- Advertisement -
- Advertisement -

క్వీన్ అనుష్క శెట్టి యాక్షన్ డ్రామా ఘాటి (Ghati)అద్భుతమైన ట్రైలర్ రిలీజ్ తర్వాత అంచనాలు నెక్స్ లెవెల్‌కి చేరుకున్నాయి. విక్రమ్ ప్రభు మేల్ లీడ్‌గా నటించిన ఈ చిత్రానికి విజనరీ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. యువి క్రియేషన్స్ సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మించారు. మేకర్స్ ఇప్పుడు సినిమా సెకండ్ సింగిల్ దస్సోరాను రిలీజ్ చేశారు. సాగర్ నాగవెల్లి కంపోజ్ చేసిన ఈ పాట ఘాటీల జీవన శైలిని, వారి సంస్కృతిని అద్భుతంగా (Culture amazing) చూపించింది. విజువల్స్‌లో అనుష్క శెట్టి, విక్రం ప్రభు, ఇంకో ఘాటీల టీమ్ గంజాయిని రహస్యంగా తీసుకుపోతూ, పోలీసుల్ని తప్పించుకుంటున్న సీన్స్ చూపించారు. బిగ్ స్క్రీన్ మీద ఈ సాంగ్ ఇంకా బాగుంటుంది. సెప్టెంబర్ 5న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కోసం సిద్ధమవుతోన్న ఘాటి… తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో పాన్ ఇండియా రిలీజ్ కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News