క్వీన్ అనుష్క శెట్టి నటిస్తున్న యాక్షన్ డ్రామా ఘాటి. (Ghati) విక్రమ్ ప్రభు మేల్ లీడ్ గా నటించిన ఈ చిత్రానికి విజనరీ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. యువి క్రియేషన్స్ సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో చైతన్య రావు కీలక పాత్ర పోషించారు. సెప్టెంబర్ 5న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ నేపధ్యం లో చైతన్య రావు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ “ఈ సినిమాలో నాది చాలా సీరియస్, వయోలెంట్ రోల్. సినిమాలో నా పాత్ర రెగ్యులర్ విలన్‌లాగా ఉండదు. డైరెక్టర్ క్రిష్… నా పాత్రను ఒక మెయిన్ క్యారెక్టర్‌లాగే చూస్తున్నాను అని చెప్పారు.
గుర్తుండిపోయే క్యారెక్టర్ ఇది. ఇదొక ఐకానిక్ క్యారెక్టర్ అవుతుందనే నమ్మకం ఉంది. ఈ సినిమాని ఈస్ట్రన్ ఘాట్స్‌లో షూట్ చేశాము. అక్కడ షూట్ చేయడం చాలా ఛాలెంజింగ్.(Very challenging) ఇందులో ఒక జలపాతం సీన్ ఉంది. ఆ సీన్ చేయడం చాలా రిస్కీ. అనుష్క చాలా రిస్క్‌తో ఆ సీక్వెన్స్ చేశారు. అది చూసినప్పుడు చాలా థ్రిల్ అవుతారు. అనుష్క బిగ్ లేడీ సూపర్ స్టార్. ఆమెతో వర్క్ చేయడం అద్భుతమైన అనుభవాన్నిచ్చింది. -మనోజ్ అద్భుతమైన విజువల్స్ ఇచ్చాడు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ సాగర్ నాగవల్లి కూడా వండర్‌ఫుల్ మ్యూజిక్ ఇచ్చాడు. -ప్రస్తుతం క్రాంతి మాధవ్‌తో ఒక సినిమా చేస్తున్నాను. దీంతోపాటు ఇంకొన్ని కథలు కూడా సిద్ధంగా ఉన్నాయి”అని అన్నారు.