Saturday, May 10, 2025

‘భైరవం’ వచ్చేది అప్పుడే

- Advertisement -
- Advertisement -

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ ‘భైరవం’. ఇప్పటికే పవర్‌ఫుల్ పోస్టర్లు, యాక్షన్ తో నిండిన టీజర్, రెండు సూపర్ హిట్ సాంగ్స్ తో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మొదటి పాట రొమాంటిక్ మెలోడీగా కాగా, రెండో సింగిల్ పవర్ ఫుల్ డివోషనల్ సాంగ్‌గా అలరించింది. దర్శకుడు విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ సత్య సాయి ఆర్ట్ బ్యానర్‌పై కెకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. పెన్ స్టూడియోస్ అధినేత డా. జయంతిలాల్ గడా చిత్రాన్ని సమర్పిస్తున్నారు. తాజాగా మేకర్స్ సినిమాకు విడుదల తేదీని ప్రకటించారు. ఈ వేసవి సీజన్‌లో పెద్ద ఆకర్షణగా మే 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ‘భైరవం‘ విడుదల కాబోతోంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ముగ్గురూ కలర్‌ఫుల్ ఫెస్టివల్ వైబ్ తో కనిపించిన రిలీజ్ డేట్ పోస్టర్ అదిరిపోయింది. ఈ చిత్రంలో ఆదితి శంకర్, ఆనంది, దివ్య పిళ్ళై కథానాయికలుగా నటిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News