Friday, August 15, 2025

జనవరిలో ‘స్పిరిట్’ సెట్స్‌లోకి..

- Advertisement -
- Advertisement -

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas)డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ‘స్పిరిట్’  అనే టైటిల్‌తో తెరకెక్కించేందుకు సందీప్ రెడ్డి వంగా సిద్ధమవుతున్నాడు. ఇక ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే, ఈ చిత్రాన్ని సెప్టెంబర్ తొలి వారంలో పూజా కార్యక్రమంతో లాంచ్ చేసేందుకు మేకర్స్ రెడీ (Makers ready) అవుతున్నారు. కాగా ప్రభాస్ ప్రస్తుతం ‘ది రాజాసాబ్’, ‘ఫౌజీ’ చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఈ రెండు సినిమాలను ముగించాక ఆయన స్పిరిట్‌లో చేరతాడని తెలుస్తోంది. దీంతో జనవరి 2026లో ఆయన స్పిరిట్ చిత్రంలో అడుగుపెడతాడని చిత్ర వర్గాల టాక్. ఇక ఈ సినిమాను పవర్‌ఫుల్ కాప్ యాక్షన్ థ్రిల్లర్‌గా మేకర్స్ రూపొందించనున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించబోతున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News