బెంగళూరు: రేణుకస్వామి హత్య కేసులో పరప్పన అగ్రహార జైలులో శిక్ష కన్నడ నటుడు దర్శన్ (Actor Darshan) తన బాధలు వీడియో కాన్ఫరెన్స్‌లో జడ్జితో తన బాధలు చెప్పుకున్న విషయం తెలిసిందే. జైలులో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని.. తను ఇక్కడ ఉండలేనని.. ఇంత విషమివ్వాలని దర్శన్ జడ్జిని కోరాడు. దీనిపై బెంగళూరు కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అతనికి జైలులో ప్రాథమిక సౌకర్యాలు కల్పించాలని జైలు అధికారులను ఆదేశించింది. అదే సమయంలో దర్శన్‌ను పరప్పన అగ్రహార జైలు నుంచి బళ్లారి జైలుకు తరలించాలనే అధికారుల విజ్ఞప్తిని తిరస్కరించింది. దర్శన్‌ను బళ్లారి జైలుకు మార్చడానికి ఎటువంటి బలమైన కారణం లేదని కోర్టు పేర్కొంది.
కాగా, తన ప్రియురాలు పవిత్ర గౌడతో అసభ్యంగా ప్రవర్తించాడని రేణుక స్వామి అనే వ్యక్తిని దర్శన్ (Actor Darshan) హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో దర్శన్‌తో పాటు పవిత్ర గౌడ కూడా జైలు శిక్ష అనుభవిస్తోంది. తాజాగా దర్శన్ ఈ కేసులో వర్చువల్ విచారణ సమయంలో ‘‘సూర్యరశ్మిని చూసి నెల రోజులైంది. గదిలో దుస్తులు దుర్వాసన వస్తున్నాయి. ఫంగస్ తీవ్రత భయాందోళనకు గురి చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో నేను బతకలేను. నాకు విషమివ్వండి..’’ అని జడ్జిని వేడుకున్నాడు. అతని అభ్యర్థనను మన్నించిన న్యాయస్థానం ప్రాథమిక వసతులు కల్పిస్తూ.. నటుడికి కాస్త ఊరట ఇచ్చింది.
Also Read : మెగా ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. తండ్రైన హీరో వరుణ్ తేజ్