Tuesday, July 15, 2025

మంత్రి జూపల్లిని కలిసిన బాలీవుడ్ నటుడు గగన్ మాలిక్

- Advertisement -
- Advertisement -

ప్రముఖ బాలీవుడ్ నటుడు, జీటీవీ రామాయణంలో రాముడి పాత్రధారి, బుద్దిజం ప్రచారకులు గగన్ మాలిక్ బేగంపేట టూరిజం ప్లాజాలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. గగన్ మాలిక్‌ను బుద్ధవనం ప్రాజెక్ట్ స్పెషల్ ఆఫీసర్ మల్లేపల్లి లక్ష్మయ్య మంత్రి జూపల్లికి పరిచయం చేశారు. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన బుద్ధవనానికి ప్రపంచ దేశాల్లో ప్రాచుర్యం కల్పించడం, వివిధ బౌద్ధ దేశాలను బుద్ధవనానికి రప్పించడం, వారి సాంస్కృతిక కేంద్రాలను బుద్ధవనంలో ఏర్పాటు చేయడంతో పాటు ఈ ఏడాది అక్టోబర్‌లో థాయ్‌లాండ్‌కు చెందిన బౌద్ధ భిక్షువులు సుమారు వంద మందితో గుల్బర్గా మీదుగా బుద్ధవనానికి పాదయాత్రగా రావడం తదితర అంశాలను ఈ సందర్భంగా చర్చించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News