Tuesday, July 15, 2025

అలనాటి అందాల తార సరోజాదేవి కన్నుమూత

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : అలనాటి అందాలతార బి.సరోజా దేవి (87)కన్నుమూ శా రు. ఆరోగ్య సమస్యల తో బాధపడుతున్న ఆమె బెంగుళూరులోని మ ణిపాల్ హాస్పిటల్‌లో చి కిత్స పొందుతూ మృతి చెందారు. సరోజా దేవి తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో 200కు పైగా సినిమాల్లో ఎన్నో గొప్ప పాత్రల్లో నటించి ప్రేక్షకులను అలరించా రు. 1938 సంవత్సరం జనవరి 7న బెంగళూరు లో బి.సరోజాదేవి జన్మించారు. తండ్రి బైరప్ప మై సూర్‌లో పోలీస్ ఆఫీసర్‌గా పని చేసేవారు. తల్లి గృహిణి. తండ్రి ప్రోద్బలంతో డాన్స్ నేరుకున్న ఆ మె ఆతర్వాత సినిమాలపై ఆసక్తి చూపారు. ఎన్నో విలక్షణ పాత్రలు పోషించిన ఆమె కన్నడ సినిమా ‘మహాకవి కాళిదాసు’తో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకు న్నారు.

ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎంజీఆర్‌ల వంటి దిగ్గజ నటులతో పలు సూపర్ హిట్ సినిమాల్లో న టించిన బి.సరోజాదేవి ‘అభినయ సరస్వతి’ బిరు దును అందుకున్నారు. తెలుగులో మహాకవి కాళి దాసు, భూకైలాస్, పెళ్లి కానుక, పెళ్లి సందడి, ఇంటికి దీపం ఇల్లాలే, జగదేకవీరుని కథ, శ్రీ సీతారామ కల్యాణం, దాగుడు మూతలు, ఆత్మబలం, అమరశిల్పి జక్కన, శకుంతల, ఉమా చండీ గౌరీశంకరుల కథ, శ్రీ రామాంజనేయ యుద్ధం, సీతారామ వనవాసం, దానవీర శూరకర్ణ వంటి ఎన్నో హిట్ చిత్రాల్లో నటించారు. 1955 నుంచి 1984 మధ్య కాలంలో 29 ఏళ్ల పాటు వరుసగా 160కి పైగా సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన ఏకైక నటిగా సరోజా దేవి చరిత్ర సృష్టించారు. సినీ రంగానికి చేసిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం బి.సరోజా దేవిని 1969లో పద్మశ్రీతో, 1992లో పద్మభూషణ్ పురస్కారాలతో సత్కరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News