Monday, June 2, 2025

హైదరాబాద్ పబ్ లో హీరోయిన్ పై దాడి..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గచ్చిబౌలిలోని ప్రిజం పబ్‌లో తనపై దాడి చేశారంటూ ఆరోపిస్తూ హీరోయిన్ కల్పిక గణేష్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. విప్రో సర్కిల్ వద్ద ఉన్న ప్రిజం పబ్‌లో హీరోయిన్ కల్పిక బర్త్ డే సెలబ్రేషన్స్ చేేసుకునేందుకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బర్త్‌డే కేక్ విషయంలో హీరోయిన్ కల్పిక, పబ్ నిర్వాహకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పబ్ నిర్వాహకులు తనపై దాడి చేశారని.. పబ్ సిబ్బంది కూడా తనతో దురుసుగా ప్రవర్తించారని కల్పిక పోలీసులకు ఫిర్యాదు చేంది. దీంతో ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News