- Advertisement -
కెరీర్ ఆరంభమే మహానటి లాంటి బయోపిక్ చిత్రంలో లెజెండరీ సావిత్రి పాత్ర లో అద్భుతంగా నటించి మెప్పించిన కీర్తి సురేశ్‌కి జాతీయ ఉత్తమ నటి అవార్డు దక్కింది. ఆ తర్వాత టాలీవుడ్‌లో యువహీరోల సరసన నటిస్తూనే, అగ్ర హీరోల సినిమాల్లోనూ అవకాశం అందుకుంది. చూస్తుండగానే దశాబ్ధం కెరీర్ రన్ పూర్తి చేసింది. పన్నెండేళ్లుగా ఈ బ్యూటీ సినీరంగంలో కథానాయికగా రాణించడం అంటే అంత సులువు కాదు. కానీ కీర్తి ఉత్తమ నటిగా నిరూపించుకుంటూ కెరీర్‌ని ముందుకు నడిపిస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కీర్తి మాట్లాడుతూ.. ‘ఒకవేళ నేను నటి అవ్వకపోతే కనీసం స్టైలిష్ట్ లేదా మోడల్ అయ్యేది. అయితే మా అమ్మ మేనక బాటలోనే నటి అయ్యాను. మా తల్లిదండ్రుల నుంచి కళ అబ్బింది’ అని అన్నారు.
- Advertisement -