హైదరాబాద్: నటి రంగసుధాపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టడంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు. రాధాకృష్ణ అనే వ్యక్తి, కొన్ని ట్విట్టర్ పేజీలో ఆమెపై అసభ్యకర పోస్టులు పెట్టడంతో వాటి నిర్వాహకులపై రంగ సుధా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తన ప్రైవేట్ వీడియోలు, ఫోటోలు ఆన్‌లైన్‌లో పెడతామని కొందరు బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు షేర్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. గతంలో రాధాకృష్ణ అనే వ్యక్తితో రంగసుధా డేటింగ్ చేసినట్టు సమాచారం.
Also Read: వెనిజులా నౌకపై అమెరికా దాడి: 11 మంది మృతి
- Advertisement -