- Advertisement -
కన్నడ నటి రన్యారావు 127.3 కిలోల బంగారం అక్రమంగా రవాణా చేసినట్టు దర్యాప్తులో తేలింది. దీంతో రూ. 102.55 కోట్లు జరిమానా చెల్లించాలని డీఆర్‌ఐ ఆమెకు నోటీసు జారీ చేసింది. న్యాయవిచారణ తరువాత డిఆర్‌ఐ అధికారులు రన్యారావుకు జైల్లోనే నోటీసులు అందజేశారు. 102.55 కోట్ల పెనాల్టీ చెల్లించని పక్షంలో ఆస్తులను జప్తు చేస్తామని నోటీసు ద్వారా హెచ్చరించారు. అలాగే రన్యాతో సహా మరో నలుగురు నిందితులకు జైల్లోనే నోటీసులు ఇచ్చారు. విదేశీ మారక ద్రవ్య పరిరక్షణ , స్మగ్లింగ్ కార్యకలాపాల నివారణ బోర్డు వేసిన పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు విచారించింది. రన్యా రనూన. 102.55 కోట్లు, తరుణ్ కొండూర్ రాజు రూ. 62 కోట్లు, భరత్‌జైన్, సాహిల్‌జైన్, ఒక్కొక్కరు రూ.33 కోట్లు జరిమానా చెల్లించాలని ఆదేశించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 11కు వాయిదా వేసింది.
- Advertisement -