కన్నడ నటి రన్యా రావు(33)కు బెయిల్ లభించింది. బంగారం స్మగ్లింగ్ కేసులో అరెస్టయిన నటి రన్యా రావుకు బెంగళూరులోని ప్రత్యేక కోర్టు మంగళవారం చట్టబద్ధమైన బెయిల్ మంజూరు చేసింది. మార్చి 3న బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో రన్యా నుండి డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) రూ.12.56 కోట్ల విలువైన బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకుంది. తరువాత, ఈ కేసుకు సంబంధించి తరుణ్ కొండూరు రాజు, సాహిల్ సకారియా జైన్‌లను అరెస్టు చేశారు.
సీనియర్ ఐపీఎస్ అధికారి రామచంద్రరావు కుమార్తె రన్యా రావు, ఆమె సహచరులు పరప్పన అగ్రహారలోని బెంగళూరు సెంట్రల్ జైలులో ఉన్నారు.అయితే, బెయిల్ మంజూరు చేయబడినప్పటికీ, రన్యా రావుతో పాటు ఆమె ఇద్దరు సహచరులు కఠినమైన విదేశీ మారక ద్రవ్య మార్పిడి, స్మగ్లింగ్ కార్యకలాపాల నిరోధక చట్టం 1974 (COFEPOSA చట్టం, 1974) కింద కేసు నమోదు కావడంతో జైలులోనే ఉండాల్సి పరిస్థితి వచ్చింది.