నితిన్ హీరోగా లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రల్లో నటించిన ‘తమ్ముడు’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ సప్తమి గౌడ మీడియాతో మాట్లాడుతూ “-ఈ సినిమాలో అంబరగొడుగు అనే ఊరిలో ఉండే రత్న అనే అమ్మాయి క్యారెక్టర్ నాది. తను పవన్ కల్యాణ్ అభిమాని. నా క్యారెక్టర్ కు ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ కూడా ఉంటుంది. కాంతారతో చూస్తే లుక్ పరంగా నా క్యారెక్టర్ ఒకేలా ఉంది అనిపించవచ్చు
కానీ క్యారెక్టర్ గా చూస్తే పూర్తిగా భిన్నమైనది. ‘తమ్ముడు’ కాస్త సీరియస్ సబ్జెక్ట్. లయ, నితిన్ కొన్ని పరిస్థితుల్లో అంబరగొడుగు అనే ఊరికి వస్తారు. వారి జర్నీలో రత్న ఎలా భాగమైంది అనేది ఆసక్తికరంగా ఉంటుంది. ఈ సినిమాలో కొండలు, గుట్టల్లాంటి ప్రాంతంలో హార్స్ రైడింగ్ చేయాల్సివచ్చింది, ఇబ్బందిపడ్డాను. కానీ ఆ సన్నివేశాలన్నీ బాగా వచ్చాయనే సంతృప్తి ఉంది. ‘తమ్ముడు’ సినిమా నటిగా నాకు తప్పకుండా మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నా”అని అన్నారు.